తెలుగు సినిమా, బుల్లితెర రంగాల్లో పరిచయం అక్కర్లేని పేరు సుమ కనకాల. దాదాపు 30 ఏళ్లుగా యాంకర్‌గా కొనసాగడమే కాదు.. అదే క్రేజ్‌ను కంటిన్యూ చేయడం ఒక్క సుమకే చెల్లింది. తెలుగు బుల్లితెరపై తొలి తరం యాంకర్లలో ఆమె కూడా ఒకరు. సుమతో పాటు కెరీర్ ప్రారంభించిన వారు ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోగా, ఆమె మాత్రం ఇప్పటికీ స్టార్ యాంకర్‌గా కొనసాగుతున్నారు. కొత్తగా ఎంతో మంది అందగత్తెలు, అద్భుతంగా మాట్లాడగలిగే వారు వస్తున్నా సుమ క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకోవడం, జెన్ జీ జనరేషన్‌కు తగ్గట్లుగా హోస్టింగ్ చేయడం ఆమె విజయ రహస్యాలు.
మలయాళీ అమ్మాయే అయినా తెలుగును తెలుగువారి కంటే అద్భుతంగా మాట్లాడగలరు సుమ. సందర్భానికి తగిన విధంగా పంచ్‌లు విసరడం, ఎలాంటి వాతావరణాన్ని అయినా ఆహ్లాదకరంగా మాట్లాడటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఎలాంటి స్క్రిప్ట్ లేకపోయినా అప్పటికప్పుడు ఈవెంట్స్ నడిపించగల సత్తా ఆమె సొంతం. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుమ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళ్తోంది.
సుమ తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆమె బాల్యం సికింద్రాబాద్‌లోని మెట్టుగూడ ప్రాంతంలో గడిచింది. చిన్నతనం నుంచే డ్యాన్స్, సంగీతం నేర్చుకుని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత సినిమాలలో చిన్నా చితకా పాత్రలు పోషించారు. ఈ దశలో దూరదర్శన్‌కు పోటీగా అప్పుడప్పుడే కేబుల్ టీవీ ప్రసారాలు భారతదేశంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తున్న కాలంలో టీవీ భవిష్యత్తును ఆనాడే ఊహించారు సుమ. దూరదర్శన్‌లో యాంకర్‌గా, వ్యాఖ్యాతగా పలు కార్యక్రమాలు హోస్ట్ చేశారు. ఆ తర్వాత ఈటీవీ, జెమినీ టీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ ప్రారంభం కావడంతో సుమ వేగంగా అవకాశాలను అందిపుచ్చుకున్నారు. 2000వ దశకం నుంచి టాలీవుడ్‌లో సుమ హవా స్పష్టంగా కనిపించింది. విచ్చలవిడిగా పుట్టుకొచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌కు తోడు ఆడియో లాంచ్‌లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్‌లు, ఇంటర్వ్యూలతో పాటు సినిమాలలో చిన్నా చితకా పాత్రలు పోషిస్తూ టాప్ గేర్‌లో దూసుకెళ్లారు సుమ. ఆమె హోస్ట్ చేసిన స్టార్ మహిళ అనే కార్యక్రమం ఏకంగా 3000 ఎపిసోడ్స్‌కి పైగా టెలికాస్ట్ అయి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. నటుడు రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో వీరిద్దరూ వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు రోషన్ కనకాల, మనస్విని కనకాల సంతానం. కొడుకు రోషన్‌ను హీరోగా నిలబెట్టేందుకు రాజీవ్ - సుమల కష్టపడుతున్నారు. తన సక్సెస్ వెనుక భర్త రాజీవ్ కనకాల సహకారం ఎంతో ఉందని పలుమార్లు చెప్పారు సుమ. సినిమాలు, ఈవెంట్స్, ప్రైవేట్ కార్యక్రమాలు, టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులను పలకరిస్తుంటారు సుమ. ఫోటో షూట్స్‌తో పాటు కొన్ని ఫన్నీ వీడియోలు చేస్తుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతోంది. కొందరు అమెరికా వెళ్లి, మరికొందరు వెళ్లకుండా వెళ్లామని చెప్పి తెగ బిల్డప్‌లు ఇస్తుంటారు. సోషల్ మీడియా యుగంలో వ్యూస్ కోసం, క్రేజ్ కోసం ఇవి మరింత ఎక్కువయ్యాయి. ఇలాంటి వారిపై సెటైరికల్‌గా సుమ ఈ వీడియో పెట్టారు. రీసెంట్‌గా యూఎస్ ట్రిప్ వేసిన ఈ స్టార్ యాంకర్ ..మనం అమెరికాలో ఉన్నామని ఎవరినైనా నమ్మించాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలని కొన్ని రూల్స్ చెప్పుకొచ్చింది. ముందు కళ్లజోడు ఉండాలి.. ఒక్కోసారి కనిపించదు కానీ మేనేజ్ చేయాలి, చేతిలో ఒక కప్పుండాలి.. ఈ కప్పులో ఏమున్నా లేకపోయినా పర్లేదు కానీ కప్పు మాత్రం తప్పనిసరి. ఎదురుగా వచ్చే వారిని ఇంగ్లీష్‌లో పలకరించాలి.. నెక్ట్స్ మన దగ్గర కుప్పలు కుప్పలు టిష్యూ రోల్స్ ఉండాలని చెప్పుకొచ్చారు సుమ కనకాల. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.More Articles