72nd National Film Awards: భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల (72nd National Film Awards)లను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. శనివారం సాయంత్రం అధికారికంగా ఈ అవార్డులను ప్రకటించారు. కాగా 2024లో జనవరి నుంచి డిసెంబర్ దాకా సెన్సార్ అయిన సినిమాలను పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించారు.
ఇందులో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పొందిన సినిమాలను ఎంపిక చేశారు. ఇందులో ఫీచర్, నాన్ ఫీచర్ చిత్రాలలో నటన, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఇతర సాంకేతిక విభాగాలలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి అవార్డులు ప్రకటించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైన చిత్రాలు పోటీ పడ్డాయి. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి సహా వివిధ కేటగిరీల్లో పురస్కారాలు ఎవరికి లభించాయటంటే?
ఉత్తమ తెలుగు చిత్రంగా 'కమిటీ కుర్రాళ్లు' పురస్కారానికి ఎంపికైంది. ఉత్తమ తమిళ చిత్రంగా 'రాయన్' నిలిచింది.More Articles