Akhil Akkineni On Salaar 2: యంగ్ హీరో అఖిల్ అక్కినేని 'లెనిన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రేమ,భావోద్వేగాలు, భక్తి అంశాల నేపథ్యంలో రూపొందిన ఈ రూరల్ యాక్షన్ డ్రామాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేశ్ ఇందిరా కీలక పాత్రల్లో కనిపించారు. విడుదలైన తొలి రోజే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సారి బ్లాక్ బస్టర్ పక్కా అని భావిస్తున్నారు. అయితే.. విడుదలకు ముందు ప్రమోషన్స్‌లో 'సలార్ 2' రూమర్స్‌పై ఆయన ఇచ్చిన క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?

Advertisement
Advertisement

అక్కినేని అఖిల్ హీరోగా 'లెనిన్' ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో చాలా రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'సలార్ 2' రూమర్స్‌పై కూడా ఆయన స్పందించారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'సలార్: పార్ట్ 2 - శౌర్యాంగ పర్వం'లో అఖిల్ కీలక పాత్ర పోషిస్తున్నారనే వార్తలకు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పెట్టారు.

ఇంతకీ రూమర్స్ ఎలా..
'సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్' భారీ విజయం సాధించిన తర్వాత బెంగళూరులో హోంబలే ఫిల్మ్స్ గ్రాండ్ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఆ వేడుకకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆహ్వానం మేరకు అఖిల్ కూడా హాజరయ్యారు. ఆ సమయంలో ప్రభాస్, ప్రశాంత్ నీల్‌తో కలిసి దిగిన అఖిల్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో 'ఏజెంట్'సినిమా కోసం అఖిల్ పెంచిన గడ్డం, రగ్గడ్ లుక్ కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీంతో "సలార్ 2లో ప్రభాస్‌కు తమ్ముడిగా అఖిల్ నటిస్తున్నాడు", "శౌర్యాంగ తెగకు చెందిన యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు" అంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు చక్కర్లు కొట్టాయి.

Advertisement

రూమర్స్‌పై అఖిల్ క్లారిటీ
తాజాగా 'లెనిన్' ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఇదే విషయాన్ని ప్రస్తావించగా అఖిల్ స్పందించారు."సలార్ సీక్వెల్‌లో మీరున్నారని ప్రచారం జరుగుతోంది" అని ప్రశ్నించగా.. "దీనికి చాలా సింపుల్‌గా క్లారిటీ ఇస్తాను" అంటూ అఖిల్ అసలు విషయాన్ని వివరించారు. అఖిల్ మాట్లాడుతూ.. 'ప్రశాంత్ నీల్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సలార్ సక్సెస్ అయినప్పుడు నేను వేరే పని మీద బెంగళూరులో ఉన్నాను. అదే సమయంలో ప్రశాంత్ ఫోన్ చేసి సక్సెస్ పార్టీకి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించాడు. నేను అక్కడికి వెళ్లాను. ఆ సమయంలో నాకు గడ్డం ఎక్కువగా ఉండేది. అదే చూసి నేను కూడా సలార్ 2లో నటిస్తున్నానని అందరూ అనుకున్నారు' అని నవ్వుతూ చెప్పారు.

Advertisement

గడ్డమే కారణమా?
అఖిల్ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే.. ఆయన 'సలార్ 2'లో నటిస్తున్నారనే ప్రచారానికి ప్రధాన కారణం ఆ సక్సెస్ పార్టీకి హాజరు కావడం, అప్పటి ఆయన రగ్గడ్ లుక్ మాత్రమే. ఎలాంటి అధికారిక చర్చలు, సైన్ చేసిన ప్రాజెక్ట్ లేకుండానే అభిమానులు ఊహాగానాలు మొదలుపెట్టారని ఆయన స్పష్టం చేశారు. అంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన "ప్రభాస్‌కు తమ్ముడిగా అఖిల్","శౌర్యాంగ యోధుడి పాత్ర" వంటి కథనాలకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవని ఆయన వ్యాఖ్యలతో స్పష్టమైంది.

Advertisement

అఖిల్ చెప్పిన ఈ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది అభిమానులు "ఒక్క గడ్డం వల్ల ఇంత పెద్ద రూమర్ పుట్టిందా?" అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం భవిష్యత్తులో ప్రశాంత్ నీల్, అఖిల్ కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.