అగ్రనటి సమంతపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు అక్కినేని అఖిల్. తన లెనిన్ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ షోలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో కలిసి అఖిల్ సందడి చేశారు. ఈ సందర్భంగా లెనిన్ సినిమా ప్రయాణం, సక్సెస్, ఇతర వివరాలను ఆయన పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమోను జీ తెలుగు విడుదల చేసింది. ఈ వివరాలలోకి వెళితే..

Advertisement
Advertisement

నాగచైతన్యతో విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ సమంతపై అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు అఖిల్. కొద్దిరోజుల క్రితం లెనిన్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలో సమంత నటించిన మా ఇంటి బంగారం ప్రస్తావన వచ్చింది. దీనిపై అఖిల్ స్పందిస్తూ.. లెనిన్ ప్రమోషన్స్ వల్ల తాను మా ఇంటి బంగారం చూడలేదని, ట్రైలర్ బాగుందని సమంత అద్భుతంగా నటించారని ప్రశంసలు కురిపించారు. ఆ వెంటనే అఖిల్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు సమంత. లెనిన్ రిలీజ్ రోజున ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమా మంచి విజయం సాధించాలని .. లెనిన్‌ప ఇప్పటికే బ్లాక్‌బస్టర్ వైబ్ ఉందని సమంత రాసుకొచ్చారు.

Advertisement

తాజాగా మరోసారి సమంతపై ప్రశంసలు కురిపించారు అఖిల్. జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ షోకు భాగ్యశ్రీ బోర్సేతో కలిసి అఖిల్ సందడి చేశారు. అఖిల్‌ను చూసి ఇక్కడున్న పిల్లలంతా ఇన్స్‌పిరేషన్‌గా తీసుకోవాలి. చాలా ఎంగేజ్‌లోనే నటించాడని యాంకర్ సుధీర్ ప్రశంసించారు. చిన్నప్పుడే సిసింద్రీతో బ్లాక్‌బస్టర్ కొట్టాడని అనిల్ రావిపూడి చెప్పగా.. వచ్చే సంక్రాంతికి మనం ఒక సినిమా తీయాలని అఖిల్ కోరారు. ఆ వెంటనే పానీపూరి బండితో పిల్లలు చేసిన అల్లరిని ఎంజాయ్ చేశారు అఖిల్. నాకు పానీపూరి తినడం అంటే చాలా ఇష్టం.. కానీ మిమ్మల్ని చూశాక పానీపూరి తినాలంటే భయం వేస్తోందని కౌంటర్ వేశాడు అఖిల్.

Advertisement

నాకు కూడా పానీపూరి తినాలనిపిస్తోందని భాగ్యశ్రీ చెప్పడంతో మీ అడ్రస్ చెబితే మీ ఇంటి ముందు నేను పానీపూరి బండిని పెడతానని సుధీర్ చెబుతాడు. నువ్వు ఎక్కువ మాట్లాడితే అఖిల్ కాస్తా లెనిన్‌గా మారతాడని అనిల్ రావిపూడి పంచ్ విసరగా.. సుధీర్‌ను ఎవరూ ఏం చేయలేరు జై సుధీర్ అన్నా అంటూ అఖిల్ సెటైర్లు వేస్తాడు. క్రికెట్ గురించి మీకు బాగా తెలుసని అనుకుంటున్నాను నేను అని సుధీర్ అనడంతో.. నీకంటే బాగా తెలుసని అఖిల్ ఆన్సర్ ఇస్తాడు. సుధీర్ టాస్ వేయగా నాకు బ్యాటింగ్ కావాలని చెబుతాడు అఖిల్. ఆ తర్వాత స్టేజ్ మీదే అందరితో కలిసి క్రికెట్ ఆడతారు.

Advertisement

చివరిలో ఒక్కొక్కరి గురించి చెప్పాలని అఖిల్‌కు పోస్టర్స్ వేస్తుంటాడు సుధీర్. తొలుత చిరంజీవి- వెంకటేష్ నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ పోస్టర్ వస్తుంది. ప్రతి సంక్రాంతికి వస్తారు కొట్టుకెళ్లిపోతారని అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురిపిస్తాడు అఖిల్. తర్వాత రామ్ చరణ్ నటించిన పెద్ది పోస్టర్ ప్రదర్శించగా.. మై ఆర్సీ మై హార్ట్ బీట్ అని చెబుతాడు. ఆ వెంటనే సమంత నటించిన మా ఇంటి బంగారం పోస్టర్ ప్రదర్శించగా.. ఫిమేల్ పవర్ చూపించిందని ఆమెపై ప్రశంసలు కురిపించాడు. చివరిలో లెనిన్ పోస్టర్‌ను చూపించగా.. నీ జర్నీ చాలా మందికి ఇన్‌స్పిరేషన్ అని అనిల్ రావిపూడి చెబుతాడు. లెనిన్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో తండ్రి నాగార్జున కాళ్లకి నమస్కరించిన వీడియోను ప్రదర్శించడంతో అఖిల్ ఎమోషనల్ అయ్యారు. ఇంట్లో వాళ్లు కూడ పెయిన్ ఫీల్ అయ్యారు, నేచురల్‌గా ఆ మూవ్‌మెంట్లో వచ్చేసిందని చెప్పారు అఖిల్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు అఖిల్‌ జర్నీ గురించి కామెంట్స్ పెడుతున్నారు.