టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా స్టార్ కొరియోగ్రాఫర్స్ అయిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది. అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తలు చోటు చేసుకోవడం.. బాహాబాహీకి దిగడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. జానీ మాస్టర్ సతీమణి, తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత అలియాస్ ఆయేషా ఏకపక్ష నిర్ణయాలు వివాదానికి దారితీసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే జానీ మాస్టర్‌ వర్గంతో శేఖర్ మాస్టర్ వర్గం గొడవకు దిగినట్లుగా తెలుస్తోంది. ఈ వివాదం టాలీవుడ్ పెద్దల వరకు వెళ్లడంతో శేఖర్‌తో గొడవపై జానీ మాస్టర్ స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

Advertisement
Advertisement

శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల గొడవ.. అసోసియేషన్ ఎన్నికల్లో వివాదంపై క్లారిటీ ఇచ్చేందుకు గాను జానీ మాస్టర్, అతని భార్య సుమలత జూలై 13న మీడియా ముందుకొచ్చారు. యూనియన్ సమస్య కోసం మాట్లాడేందుకు శేఖర్ మాస్టర్‌తో పాటు మిగిలిన కొరియోగ్రాఫర్లం అందరం కలిసి మీటింగ్ పెట్టుకున్నాం. ఈ డిస్కషన్స్‌లో కొన్ని వీడియోలు తీసుకుని కొన్ని ఛానెల్స్ శేఖర్- జానీ మాస్టర్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది, వాళ్లు తిట్టుకుని కొట్టుకునే వరకు వెళ్లినట్లుగా కథనాలు ప్రసారం చేశారు. అదంతే ఫేక్.. అలాంటివి ఏమీ లేదని జానీ మాస్టర్ తేల్చి చెప్పారు.

Advertisement

యూనియన్‌లో సీక్రెట్ బ్యాలెట్‌లో బై ఎలక్షన్స్ జరగాలా? వద్దా అనే దాని మీద డిస్కషన్ పెట్టుకున్నాం. ఎప్పటికీ శేఖర్ అన్న నాకు బ్రదర్.. చాలా మంచి వ్యక్తి, భాను మాస్టర్ కూడా చాలా మంచి వ్యక్తి. మా యూనియన్ గురించి, మా డ్యాన్సర్స్ గురించి అందరం నిలబడతాం. ఇక్కడ ఎవరూ ఎవరికీ శత్రువులు కాదు. నాకు ఏదైనా ఇబ్బంది ఉందంటే ఇప్పటికిప్పుడు శేఖర్ అన్న పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్తా. మా ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని చిరంజీవి గారి వరకు వెళ్లింది. ఈరోజు షూటింగ్‌ స్పాట్‌కు నేను చిరంజీవి సార్ దగ్గరికి వెళ్లాను, శేఖర్ అన్న కూడా రావడంతో సరదాగా మాట్లాడుకున్నాం, భోజనం కూడా చేశాం. ఇద్దరం సినిమాల సాంగ్స్, ఇతర విషయాల గురించి మాట్లాడుకున్నాం, నవ్వుకున్నామని చిరంజీవి, శేఖర్ మాస్టర్‌లతో భోజనం చేస్తున్న ఫోటోలను జానీ మాస్టర్ మీడియాకు ప్రదర్శించారు.

Advertisement

శేఖర్ మాస్టర్ గారితోనే కాదు, ఏ మాస్టర్‌తోనూ నాకు గొడవలు లేవు.. మేమంతా అన్నదమ్ముల్లా ఉంటాం, మాకు చిరంజీవి గారు అండగా ఉంటారు. మా టాలెంట్‌ను గుర్తించి హీరోలు, దర్శకులు, నిర్మాతలు, డీవోపీలు అండగా నిలుస్తున్నారు. చిరంజీవి గారు మాకు కబుర్లు చెప్పారు, నవ్వించారు. ఈ విషయంలో చిరంజీవి గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఈరోజున ఏ డ్యాన్సర్ అయినా, ఏ ఫైటర్ అయినా ఇక్కడ మంచి పొజిషన్‌లో ఉన్నారంటే చిరంజీవి గారి సినిమాలను చూసేనని జానీ మాస్టర్ తెలిపారు.

Advertisement

చిరంజీవి గారి సాంగ్స్, డ్యాన్స్ చూసి నేను ఇండస్ట్రీకి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చిన్నా పెద్దా అనే తేడా చూడకుండా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించారు. నన్నే కాదు, శేఖర్‌ని.. రీసెంట్‌గా సందీప్, పొలాచ్చి, భాను మాస్టర్ అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్‌, మిగిలిన మాస్టర్స్‌తో ఎవరితోనూ నాకు విభేదాలు లేవు. ఒక కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లే యూనియన్‌లోనూ ఉన్నాయి. కానీ ఎవరికి ఏ అవసరం వచ్చినా అందరం ముందే ఉంటాం. యూనియన్‌లోని చిన్న సమస్యకు కొరియోగ్రాఫర్స్‌కు సంబంధం లేదు అని జానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. దీంతో టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో రాజుకున్న వివాదానికి చెక్ పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా మరోసారి వివాదాన్ని పరిష్కరించారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement