Dhruv Vikram: కోలీవుడ్ యంగ్ హీరో, చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు ఆలస్యం కావడం, కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోవడం వల్ల వార్తల్లో నిలిచారు. తాజాగా ఈ యంగ్ హీరోపై నిర్మాతలు తమిళ్ ఫిల్మ్ ఛాంబర్‌లో అధికారికంగా ఫిర్యాదు చేయడం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. కమిట్ అయిన సినిమా పూర్తి చేయకుండానే మరో కొత్త సినిమా ప్రారంభించారని ఆరోపిస్తూ నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది?
ధృవ్ విక్రమ్ హీరోగా దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ ముందుకొచ్చాయి. ఈ సినిమానే ధృవ్ కెరీర్‌లో నాలుగో చిత్రం (DV4)గా రూపొందాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాతలు ఇప్పటికే కథ, ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి షూటింగ్‌కు సిద్ధమయ్యారు. ధృవ్ విక్రమ్‌కు అడ్వాన్స్‌గా 1 కోటి రూపాయలు చెల్లించినట్లు నిర్మాతలు చెబుతున్నారు. అంతేకాదు, పాటలు, సెట్లు, సాంకేతిక నిపుణులు, నటీనటుల అడ్వాన్స్‌లు తదితర ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం భారీగా ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు.
మైత్రీ మూవీ ప్రకటనతో వివాదం ముందుగా మైత్రీ మూవీ మేకర్స్ సినిమా పూర్తి చేసి, తర్వాత తమ సినిమా చేస్తానని ధృవ్ చెప్పినట్లు సమాచారం. అలా జరిగితే ఇప్పటికే పెట్టిన పెట్టుబడిపై వడ్డీల భారం తమపై పడుతుందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని మోసంగా పరిగణిస్తూ నిర్మాతలు తమిళ్ ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా మరో నిర్మాతతో కొత్త సినిమా ప్రారంభించడం పరిశ్రమ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై తమిళ్ ఫిల్మ్ ఛాంబర్ కూడా సీరియస్‌గా స్పందించినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలో ఇరు పక్షాలను పిలిచి వివరణ కోరే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. నిర్మాతల వాదన ప్రకారం.. సినిమా కోసం ఇప్పటికే భారీ మొత్తంలో ఖర్చు చేశారు. ప్రీ-ప్రొడక్షన్ పనులతో పాటు సెట్లు, లొకేషన్లు, సాంకేతిక నిపుణుల అడ్వాన్స్‌లు చెల్లించినట్లు చెబుతున్నారు. షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ ఖర్చులు పెరుగుతున్నాయని, వడ్డీల భారం కూడా అధికమవుతోందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ నిలిచిపోతే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ధృవ్ కెరీర్‌లో ఇదే మొదటిసారి కాదు ప్రస్తుతం నిర్మాతల ఆరోపణలపై ధృవ్ విక్రమ్ లేదా ఆయన టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు నమోదైన నేపథ్యంలో ఆయన స్పందనపై ఆసక్తి నెలకొంది. ఈ వివాదం చర్చల ద్వారా పరిష్కారమవుతుందా? లేక మరింత పెద్ద స్థాయికి వెళ్తుందా? అన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
షూటింగ్ ప్రారంభం కానున్న సమయంలోనే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కరణ్ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ కొత్త సినిమాను ప్రకటించారు. ఆ సినిమాకు కూడా క్లాప్ కొట్టడంతో నిర్మాతలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తమ సినిమానే ముందుగా పూర్తి చేయాల్సి ఉండగా, మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ఒప్పందానికి విరుద్ధమని వారు ఆరోపిస్తున్నారు. రమేష్ వర్మ సినిమా పూర్తయిన తర్వాతే మైత్రీ మూవీ మేకర్స్ సినిమా ప్రారంభం కావాల్సి ఉందని నిర్మాతల వాదన. ఈ విషయంపై ధృవ్ విక్రమ్‌ను సంప్రదించగా వివిధ కారణాలు చెబుతున్నారని నిర్మాతలు ఆరోపిస్తున్నారు.
ధృవ్ విక్రమ్ కెరీర్‌లో ప్రాజెక్టులు నిలిచిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఏఆర్ మురుగదాస్‌తో అనుకున్న సినిమా కార్యరూపం దాల్చలేదు. ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో చర్చలు జరిగిన ప్రాజెక్ట్ కూడా ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు మరోసారి నిర్మాతలతో వివాదం తలెత్తడంతో పరిశ్రమలో చర్చ మొదలైంది. వరుసగా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే భవిష్యత్‌లో నిర్మాతలు ధృవ్‌తో సినిమాలు చేయడానికి వెనుకాడే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.More Articles