తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జననాయగన్. తెలుగులో భారీ విజయం సాధించిన భగవంత్ కేసరి చిత్ర కథను ఆధారంగా చేసుకొని తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా అనేక మార్పులు, చేర్పులు చేసుకొన్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాను కన్నడలో భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.
ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సిినమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. గత 7 నెలలుగా సెన్సార్ క్లియరెన్స్ కోసం నిర్మాత, దర్శకులు భారీగా న్యాయపోరాటమే చేశారు. ఈ సినిమాను ఇటీవల రివ్యూ చేసిన రివైజింగ్ కమిటీ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ మూవీకి జారీ చేసిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ చిత్రం రిలీజ్ డేట్ ఎప్పడంటే?
దళపతి విజయ్ ఇమేజ్, పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌కు తగినట్టుగా రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) సభ్యులు వీక్షించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సర్టిఫికెట్ ప్రకారం.. గాయత్రి ఆర్ మీనాక్షి రాఘవన్, లతా మదన్, అనితా పీజే, శ్రీనివాసన్ ఏ, ఏ రాజ్‌కుమార్, శోభన, రమేష్ పతాంజే (పీఓ) సభ్యులు ఈ సినిమాను రివ్యూ చేశారు. జన నాయగన్ సినిమాలో విజయ్ రాజకీయ పార్టీ టీవీకే తో సంబంధం ఉన్న కొన్ని డైలాగ్స్‌ను మ్యూట్ చేశారు. తన రాజకీయ ప్రస్థానానికి దగ్గరగా ఉన్న డైలాగ్స్‌పై ఆంక్షలు విధించారు. జాతీయ పతాకం కిందకు పడిపోతున్న సీన్‌ను తొలగించారు. ఈ సినిమాలో మొత్తం 12 సీన్లపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దాంతో మొత్తంగా 20 సెకన్ల విజువల్స్ కట్ చేశారు. వాటి స్థానంలో 10 సెకన్ల కంటెంట్ రిప్లేస్ చేశారు అనే విషయాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ విషయాలను కేవీఎన్ ప్రొడక్షన్స్ గానీ, సెన్సార్ సర్టిఫికెట్‌లో గానీ వెల్లడించకపోవడంతో ఇంకా అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్‌ను సీబీఎస్‌సీ అప్‌లోడ్ చేయకపోవడం ఫ్యాన్స్‌లో ఆందోళన రేకెస్తున్నది. జన నాయగన్ సినిమాలో కంటెంట్‌కు మార్పులు, చేర్పులు చేసిన తర్వాత సెన్సార్ సభ్యులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ A (ఏ) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం 18 ఏళ్ల దాటిన ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను చూడాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారికి చూడటానికి పరిమితులు విధించారు. వాస్తవానికి ఈ సినిమా జనవరి 9వ తేదీన రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించడం వివాదంగా మారింది. ఆ తర్వాత ఈసినిమా సెన్సార్ బాధ్యతను రివైజింగ్ కమిటీకి అప్పగించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ వివాదంలో సుప్రీం కోర్టును ఆశ్రయించడం తెలిసిందే. తమిళనాడు ఎన్నికల తర్వాత విజయ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ సినిమాను జూలై 24వ తేదీన రిలీజ్ చేసేందుకు కేవీఎన్ ప్లాన్ చేస్తున్నది. ఈ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.More Articles