గడిచిన కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, అతని భార్య ఆర్తి రవి మధ్య విడాకుల కేసు నడుస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్యలో జయం రవి ప్రియురాలు కేనీషా ఫ్రాన్సిస్ వ్యవహారం మరింత రచ్చ లేపింది. ఈ గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురైన జయం రవి మీడియా ముందుకొచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్తితో తేల్చుకునే వరకు సినిమాలలో నటించనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఆర్తి - జయం రవి విడాకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..

Advertisement
Advertisement

కోలీవుడ్‌ స్టార్ హీరోలలో ఒకరిగా వెలుగొందుతున్నారు జయం రవి అలియాస్ రవి మోహన్. ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ కుమారుడే జయం రవి. ఆయనకు నిర్మాత సుజాత విజయ్ కుమార్ కుమార్తె ఆర్తితో 2009లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఆరవ్, అయాన్‌లు సంతానం. కోలీవుడ్ స్టార్ కపుల్స్‌లో ఒకరిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ జంట. అయితే అనూహ్యంగా 2024 సెప్టెంబర్‌లో ఆర్తితో తాను విడిపోతున్నట్లు ప్రకటించారు జయం రవి.

అయితే సింగర్, నటి కేనీషా ఫ్రాన్సిస్‌తో రిలేషన్ కారణంగానే జయం రవి భార్యకు విడాకులు ఇస్తున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. నాటి నుంచి రవి- ఆర్తిలు సోషల్ మీడియా వేదికగా పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. అటు కేనీషాతో రవి బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే దంపతుల మధ్య చిచ్చుపెడుతోందని, కాపురాలు కూలుస్తోందంటూ కేనీషాపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరగడంతో పాటు చంపేస్తామంటూ బెదిరింపులు కూడా రావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. రవిని వదిలేస్తున్నానని, అలాగే తనకు ఎంతో ఇష్టమైన చెన్నై నగరాన్ని కూడా వీడుతున్నట్లు ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

Advertisement

ఆ వెంటనే మీడియా ముందుకొచ్చిన జయం రవి.. భార్య, అత్తింటి వారు తనను వేధింపులకు గురిచేస్తున్నారని భోరుమన్నారు. తను కష్టపడి సంపాదించిన సొమ్మును వాడనివ్వడం లేదని, కన్నబిడ్డలను కూడా చూడనివ్వడం లేదని వాపోయారు. వాళ్లు చెప్పిన మాట వినేలా తనపై క్షుద్రపూజలు చేయించారని జయం రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ గొడవల మధ్యలోనే విడాకుల కేసులో తన భరణం కోసం ఆర్తి రవి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. జయం రవి నుంచి జీవన వ్యయాల కోసం ప్రతినెలా 40 లక్షల రూపాయలు అందేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజాగా దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆర్తి రవికి షాకిచ్చింది. నెలకు 40 లక్షల రూపాయలు భరణంగా చెల్లించడం అంటే ఏడాదికి దాదాపు 4.8 కోట్ల రూపాయలు. రవి మోహన్ ప్రస్తుత పరిస్ధితి దృష్ట్యా ఈ భరణం చెల్లించడం ఆయనకు తలకు మించిన భారంగా మారుతుందని కోర్టు పరిగణనలోనికి తీసుకుని ఆర్తి పిటిషన్‌ను తిరస్కరించింది. కేసు విచారణ ముగిసే వరకు ప్రతి నెలా 3 లక్షల రూపాయలు తాత్కాలిక భరణంగా చెల్లించాలని ఆదేశించినట్లుగా కోలీవుడ్ టాక్. దీనితో పాటు తన భార్య ఆర్తి.. పిల్లలను చూడనివ్వడం లేదని కొద్దిరోజుల క్రితం మీడిమా సమావేశంలో జయం రవి కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపైనా ఆయనకు కోర్టు ఊరట కలిగించింది. నిబంధనలకు లోబడి తన పిల్లలను కలిసేందుకు జయం రవికి అనుమతి ఇచ్చింది. దీంతో జయం రవి అభిమానులు కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తాజా పరిణామం హీరోకి భారీ ఊరట అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి కోర్టు తీర్పు పట్ల ఆర్తి రవి ఎలాంటి స్టెప్ వేస్తారో చూడాలి.