Johnny Master vs Sekhar Master: టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పేర్లు వార్తల్లో నిలిచాయి. అయితే ఈసారి సినిమా కారణంగా కాదు.. తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ (TFDA)లో జరిగిన వివాదం కారణంగా. అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో రెండు వర్గాల మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అసోసియేషన్‌లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అసోసియేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగింది?
ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో బైఎలక్షన్ నిర్వహించాలనే అంశంపై వివాదం మొదలైంది. ఈ విషయంలో అసోసియేషన్ రెండు వర్గాలుగా చీలిపోయినట్టు తెలుస్తుంది. ఎన్నికలను సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరిపించాలని జానీ వర్గం పట్టుబడుతుండగా, శేఖర్ మాస్టర్ వర్గం మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదట. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య విభేదాలు, అభిప్రాయ బేధాలు తలెత్తడంతో మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసినట్లు సమాచారం. ఈ వ్యవహారం పోలీసులకు ఫిర్యాదు వరకు వెళ్లింది. అలాగే లేబర్ కమిషన్ అధికారులు కూడా జోక్యం చేసుకున్నట్టు తెలుస్తోంది.
జానీ మాస్టర్ భార్యపై ఆరోపణలు ఈ వివాదాన్ని యూనియన్ పెద్దలు పరిష్కరించాలని సభ్యులు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఎలా జరుగుతాయి? బైఎలక్షన్‌పై ఫెడరేషన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది? సభ్యుల రాజీనామాలపై అసోసియేషన్ ఎలా స్పందిస్తుంది? అనే విషయాలపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. అయితే..పూర్తి నిజానిజాలు తెలియాలంటే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ లేదా అసోసియేషన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.
ఈ వివాదంలో జానీ మాస్టర్ భార్య సుమలత పేరు కూడా వినిపిస్తోంది. ఆమె ప్రస్తుతం అసోసియేషన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది సభ్యులు ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ప్రతి నిర్ణయం సభ్యులతో మాట్లాడకుండా తీసుకుంటున్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సుమలత ఇప్పటివరకు స్పందించలేదు. ఈ వివాదానికి నిరసనగా దాదాపు 10 మంది డ్యాన్సర్లు అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.More Articles