సన్ టెలివిజన్, మీడియా దిగ్గజం కుటుంబానికి చెందిన కావ్య మారన్ పెళ్లి వ్యవహారం ఇటీవల కాలంలో మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమానిగా ఆమె పాపులారిటీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కావ్య మారన్ వివాహం మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచందర్‌తో జరుగుతుందనే ప్రచారం కొద్ది నెలలుగా ఊపందుకొన్నది. ఈ క్రమంలో ఆ రెండు కుటుంబాల నుంచి ఎలాంటి ప్రకటన అధికారికంగా రాకపోయినప్పటికీ.. వారి పెళ్లి డేట్ ఫిక్స్ అయిందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. కావ్య, అనిరుధ్ పెళ్లికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Advertisement

సన్ టెలివిజన్ మీడియా గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తెగా కావ్య మారన్ పరిచయం అయినప్పటికీ.. ఆమె తనకంటూ ఓ గుర్తింపును ఐపీఎల్ ద్వారా సంపాదించుకొన్నారు. సన్ రైజర్స్ టీమ్ యజమానిగా ఆ జట్టును విజయపథం వైపు నడిపించిన తీరుతో ఆమెకు సోషల్ మీడియాలో అనూహ్యమైన పాపులారిటీ లభించింది. చెన్నైలో పుట్టి పెరిగినప్పటికీ.. హైదరాబాద్ ముఖ్యంగా తెలుగు ప్రజల నుంచి ఆమె పొందుతున్న గౌరవం అనూహ్యంగా చెప్పుకోవచ్చు.

Advertisement

అయితే కొద్ది నెలల నుంచి కావ్య లవ్ లైఫ్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నారు. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఊపందుకొన్నది అనే వార్తలు గుప్పుమన్నాయి. అలాంటి ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఇద్దరు ఫారిన్‌లో వెకేషన్‌కు వెళ్లడంతో ఆ రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే ఆ ఇద్దరి నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో వారి అఫైర్‌పై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.

అయితే అనిరుధ్ అంకుల్ వై జీ మహేంద్ర ఇద్దరి పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. వారిద్దరి పెళ్లి వ్యవహారం నిజమే. దక్షిణాదిలో అంగరంగ వైభవంగా జరిగే పెళ్లిలో ఒకటి కాబోతున్నది. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త నిజమే అంటూ ఆయన ఊహాగానాలకు తెర దించారు.

Advertisement

అయితే తాజాగా కావ్య, అనిరుధ్ పెళ్లి వార్త జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే వారిద్దరి ప్రేమను ఇరు కుటుంబాలు ఆమోదించాయి. రెండు ఫ్యామిలీల మధ్య చర్చల అనంతరం వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించింది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమాచారం ప్రకారం.. కావ్య మారన్, అనిరుధ్ పెళ్లిని నవంబర్ మాసంలో జరిపించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు అనే వార్త వైరల్ అయింది.

కావ్య మారన్ ఐపీఎల్ టోర్ని బిజీ షెడ్యూల్‌ను ఇటీవలే ముగించుకొన్నారు. ఐపీఎల్‌ జట్టు మాత్రమే కాకుండా సౌతాఫ్రికా 20 లీగ్ జట్టు సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు కూడా ఓనర్‌గా ఉన్నారు. ఆమె వ్యక్తిగత ఆస్తుల విలువ 19 వేల కోట్ల రూపాయలు అని బిజినెస్ వర్గాల సమాచారం.