మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ లెనిన్. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రామ్‌కి, శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు, గెటప్ శ్రీను తదితరులు కీలకపాత్రలు పోషించారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. థమన్ సంగీతం అందించారు. జూలై 10న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది లెనిన్. విడుదలైన రోజు నుంచి లెనిన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

Advertisement
Advertisement

11 ఏళ్లుగా హిట్ లేకపోవడంతో పాటు ఏజెంట్ వంటి డిజాస్టర్ తర్వాత అక్కినేని అఖిల్ నటిస్తోన్న మూవీ కావడం, టీజర్, ట్రైలర్లు ప్రమోషనల్ కార్యక్రమాలతో లెనిన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా కష్టపడిన అఖిల్.. అక్కినేని అభిమానులకు చిరస్మరణీయమైన విజయాన్ని కానుకగా అందించారు. ఈ సినిమాలో అఖిల్ నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. అఖిల్ కొత్తగా కనిపిస్తున్నాడని హావభావాలన్నీ పర్ఫెక్ట్‌గా పలికించాడని ప్రశంసలు పొందుతున్నారు. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా అఖిల్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ... అఖిల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ కెరీర్‌లో మరిన్ని విజయాలు సాధించాలని దీవించారు.

Advertisement

తాజాగా అక్కినేని కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయారు. అఖిల్‌ రిలీజైన రోజే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టవంటూ సోషల్ మీడియా ద్వారా అఖిల్‌తో ఆనందాన్ని పంచుకున్నారు ఆర్జీవీ. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. సినిమాను ఖచ్చితంగా చూడాలని రిక్వెస్ట్ చేశారు అఖిల్. తాజాగా లెనిన్ మూవీ చూసిన ఆర్జీవీ ట్విట్టర్ ద్వారా తనదైనశైలిలో రివ్యూ ఇచ్చారు.

హే అఖిల్.. ఇప్పుడే లెనిన్ చూశాను.. మూవీ ఎంత అద్భుతంగా ఉందనేది పక్కనపెడితే. అక్కినేని వంశంలో నువ్వే బెస్ట్ యాక్టర్ అని నేను తెలుసుకున్నాను. ఈ మాటను నాగార్జున మీద ఒట్టేసి చెబుతున్నా. కొన్ని సీన్స్‌లో ఎలాంటి ఎమోషన్స్ లేకపోయినా నువ్వు చాలా ఈజీగా, అలవోకగా నటించావు. ఇక భావోద్వేగాలున్న సన్నివేశాలలో అయితే ఇరగదీశావు. నీలోని నటుడిని వెలికితీసి అద్భుతంగా వాడుకున్నందుకు దర్శకుడు మురళీ కిశోర్‌కు అభినందనలు అని రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్జీవీ లాంటి దర్శకుడు కూడా లెనిన్ మూవీని అందులో అఖిల్ నటనను మెచ్చుకోవడంత అక్కినేని అభిమానులు ఈ పోస్ట్‌ను వైరల్ చేస్తున్నారు.

Advertisement

సినిమాల నిర్మాణంలో బిజీగా ఉండే రామ్ గోపాల్ వర్మ.. కొత్తగా విడుదలయ్యే సినిమాలపై తన అనుభవంతో రివ్యూ ఇస్తుంటారు. నచ్చితే ఎందుకు నచ్చిందని, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదనేది ముఖంపైనే చెప్పడం వర్మ శైలి. ఇటీవల బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన ధురంధర్ 1, ధురంధర్ ది రివెంజ్, హాలీవుడ్ మూవీ అబ్సెషన్ సినిమాలకు రామ్ గోపాల్ వర్మ తన మార్క్ రివ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లెనిన్‌పైనా ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Advertisement