సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని సూపర్ స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు. అయితే.. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా.. కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యం మాత్రం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. షూటింగ్‌లు, విదేశీ షెడ్యూల్స్, వరుస సినిమా పనులతో ఎంత బిజీగా ఉన్నా.. భార్య నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారతో గడిపే సమయాన్ని మాత్రం ఎప్పుడూ మిస్ అవ్వరు. అందుకే ఆయనను అభిమానులు కేవలం స్టార్ హీరోగానే కాకుండా.. మంచి కుటుంబ వ్యక్తిగా కూడా అభిమానిస్తుంటారు.
సితార 14వ పుట్టినరోజు
మహేష్ బాబు, నమ్రత దంపతుల కుమార్తె సితార ఘట్టమనేని జూలై 20న( నేడు) తన 14వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య బర్త్‌డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ వేడుకలకు సంబంధించిన ఓ అందమైన ఫొటోను మహేష్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. సూపర్ స్టార్ షేర్ చేసిన ఫొటోలో సితార బర్త్‌డే కేక్ కట్ చేసిన తర్వాత మహేష్ బాబు తన కూతురికి ప్రేమగా ముద్దుపెడుతూ కనిపించారు. ఇద్దరి ముఖాల్లోనూ ఆనందం కనిపిస్తోంది. టేబుల్‌పై బర్త్‌డే డెకరేషన్స్, పార్టీ క్యాప్స్, సితార ధరించిన అందమైన క్రౌన్ ఆ వేడుకకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న ఆప్యాయత ఆ ఒక్క ఫొటోలోనే స్పష్టంగా కనిపిస్తుంది.
మహేష్ ఎమోషనల్ నమ్రత కూడా భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో సితార క్రేజ్ 'వారణాసి'తో బిజీగా మహేష్ బాబు
ఈ ఫొటోతో పాటు మహేష్ బాబు రాసిన ఎమోషనల్ మేసేజ్ .. ఫ్యాన్స్ ను మరింత ఆకట్టుకుంది. "నువ్వు ఎంత పెద్దదానివైనా... నాకు మాత్రం ఎప్పటికీ నా చిన్న స్టార్‌వే. హ్యాపీ 14 సితార. ఈ ఏడాది నీ జీవితంలో మరెన్నో అద్భుతాలు జరగాలి. లవ్ యూ ఆల్వేస్" అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ ఒక్క క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొద్ది నిమిషాల్లోనే లక్షలాది లైకులు, వేలాది కామెంట్లు వచ్చాయి.
కూతురు పుట్టినరోజు సందర్భంగా నమ్రత శిరోద్కర్ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సితార అందమైన ఫొటోను షేర్ చేస్తూ.. 'మా జీవితాలను ప్రేమతో, ఆనందంతో నింపిన నా అందమైన అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఎదుగుతున్న ప్రతి క్షణాన్ని చూడటం మా జీవితంలో గొప్ప ఆశీర్వాదం. లవ్ యూ సో మచ్'అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరూ పంచుకున్న పోస్టులు అభిమానుల మనసులను హత్తుకున్నాయి.
చిన్న వయసులోనే సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించింది. డ్యాన్స్ వీడియోలు, ట్రెండింగ్ రీల్స్, ఫ్యాషన్ ఫొటోలు, పలు బ్రాండ్ యాడ్స్‌తో ఇప్పటికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. సినీ ఈవెంట్లలో కూడా తల్లిదండ్రులతో కలిసి కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. అందుకే భవిష్యత్తులో సితార హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిమానులు ఇప్పటి నుంచే కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు పోస్ట్‌కు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. హ్యాపీ బర్త్‌డే సితార, గాడ్ బ్లెస్ యూ, ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ వేలాది శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ సినిమా 'వారణాసి'లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. కూతురు పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం ద్వారా మహేష్ మరోసారి'ఫ్యామిలీ ఫస్ట్'అనే తన విలువను చాటుకున్నారు.More Articles