నటసింహం నందమూరి బాలకృష్ణ- దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబో మరో మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం NBK111 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్టు ప్రాంతంలో జరుగుతోంది. అయితే యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ సమయంలో బాలకృష్ణకు స్వల్ప గాయం అయ్యింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే నందమూరి హరికృష్ణ కుమారుడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
సమాచారం ప్రకారం.. బాలకృష్ణ, మంచు మనోజ్‌పై కీలక యాక్షన్ సీన్స్ షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఫైట్ సీన్ చేస్తుండగా బాలయ్య కాలికి గాయం అయిందట. వెంటనే మూవీ యూనిట్ షూటింగ్‌ను నిలిపివేసి ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించింది.
వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. అది చిన్న మసిల్ టియర్ అని నిర్ధారించారు. గాయం తీవ్రంగా లేకపోయినా, పూర్తిగా కోలుకోవడానికి మైనర్ సర్జరీ అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యం నిలకడగానే ఉందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ ఘటనపై దర్శకుడు గోపీచంద్ మలినేని అధికారికంగా స్పందించారు. కాకినాడలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ సమయంలో బాలకృష్ణకు స్వల్ప మసిల్ టియర్ అయిందని తెలిపారు. వైద్యుల సూచన మేరకు చిన్న మైనర్ సర్జరీ చేయనున్నట్లు వెల్లడించారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు.. సినిమాపై బాలకృష్ణకున్న అంకితభావాన్ని గోపీచంద్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయన క్రమశిక్షణ, కష్టపడే తత్వం మూవీ మేక చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుందని చెప్పారు. త్వరలోనే పూర్తిగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ నటసింహం నందమూరి బాలకృష్ణకు షూటింగ్ సందర్భంగా గాయం అయిన విషయం తెలిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. '"బాలా బాబాయ్.. త్వరగా కోలుకోండి. మీరు పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మునుపటిలాగే పూర్తి ఉత్సాహంతో, అదే జోష్‌తో మళ్లీ తిరిగి రావాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను." అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. స్పందించిన కళ్యాణ్ రామ్ ఇదిలా ఉంటే.. 'వీరసింహారెడ్డి' తర్వాత బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో NBK111పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో బాలయ్య గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన సినిమా గ్లింప్స్‌కు కూడా మంచి స్పందన లభించింది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. అయితే బాలయ్య గాయపడిన వార్తతో అభిమానులు ఆందోళన చెందినా.. మూవీ మేకర్స్ ఇచ్చిన అధికారిక ప్రకటనతో ఊరట పొందుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ త్వరగా కోలుకుని మళ్లీ సెట్స్‌పైకి రావాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
మరోవైపు.. బాలకృష్ణకు షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయం అయిన విషయం తెలిసిన వెంటనే నందమూరి కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన బాబాయ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. "త్వరగా కోలుకో బాబాయ్.. మీరు త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ సెట్స్‌పైకి వచ్చి, మీకు ఎంతో ఇష్టమైన షూటింగ్‌లో పాల్గొంటారని నాకు నమ్మకం ఉంది" అంటూ ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. కళ్యాణ్ రామ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా కామెంట్ల రూపంలో బాలయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు బాలకృష్ణకు ధైర్యం చెబుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.More Articles