గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ షూటింగులో గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. దర్శకుడు మలినేని గోపిచంద్ రూపొందిస్తున్న చిత్రం షూటింగ్ సందర్భంగా ఆయన మోకాలికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. తన కెరీర్‌లో 111వ సినిమా కోసం చిత్రీకరిస్తున్న యాక్షన్ సీన్ల సందర్భంగా జరిగిన స్వల్ప ప్రమాదం వల్ల గాయపడ్డారు.
దాంతో ఆయనను ప్రాథమికంగా కాకినాడలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి అవసరమైన చికిత్సను చేశారు. కొన్ని స్కానింగ్ రిపోర్టుల్లో ఆయనకు బలమైన గాయమైంది. కానీ దాని వల్ల పెద్దగా ఇబ్బంది లేదు. కానీ భవిష్యత్‌తో ఆ గాయం తిరగదోడకుండా సర్జరీ చేయాలని వైద్యుల సలహా, సూచన మేరకు ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. బాలయ్య ఆరోగ్యం గురించి, ప్రమాద వివరాల్లోకి సన్నిహితులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
కాకినాడలో మంగళవారం జరుగుతున్న యాక్షన్ సీన్ల చిత్రీకరణ సందర్భంగా పట్టుతప్పి బాలయ్య కిందపడిపోయారు. మోకాలికి గాయమైంది. అయితే ప్రాథమిక చికిత్స తర్వాత ఆయన షూటింగ్ చేయడానికి సిద్దమయ్యారు. యూనిట్ సభ్యులను కంగారుపడవద్దు. తాను షూటింగ్ పూర్తి చేస్తాను అని దర్శకుడు, నిర్మాతకు చెప్పడంతో వారు అంగీకరించలేదు. అయితే డూప్‌తో సినిమా షూట్ పూర్తి చేయాలని ప్రయత్నించ వద్దు. డూప్ కూడా మనిషే కాదా.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉండేలా చేయకూడదనే అభిప్రాయాన్ని గతంలోను, ఈ సందర్భంగా ఆయన చెప్పారని ఆయన సన్నిహితులు తెలిపారు. కాకినాడలో ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు ఆయనకు జరిగిన గాయాన్ని పూర్తిగా, నిశితంగా పరిశీలించారు. ఈ గాయం నుంచి వేగంగా బయటపడటానికి మైనర్ సర్జరీ అవసరం. దీర్ఘకాలంలో, భవిష్యత్‌తో ఇబ్బంది కలుగకుండా వైద్య చికిత్స అవసరం అని వైద్యులు భావించారు. అలాగే సర్జరీ తర్వాత వేగంగా కొలుకొని ఆయన తిరిగి షూట్‌కు వెళ్లడానికి వీలు అవుతుంది అని చెప్పారు. అయితే బాలకృష్ణకు జరిగిన గాయం గురించి అభిమానులు ఆందోళన చెందవద్దు. వైద్యులు పర్యవేక్షణల బాలయ్య ఉన్నారు. ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఆయన హెల్త్ గురించి మెడికల్ బులెటిన్ విడుదల చేస్తారు. బుధవారం గానీ, గురువారం గానీ సర్జరీ పూర్తి చేస్తారు అనేది ప్రాథమిక సమాచారం. అయితే సినిమా నిర్మాణం, నటనపట్ల అంకితభావం చూపించే బాలకృష్ణ గాయాన్ని లెక్క చేయకుండా నిర్మాత శ్రేయస్సు కోసం ఆలోచించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. తన వల్ల ఎవరికీ ఇబ్బంది కాకూడదని ఆయన గాయానికి ప్రాథమిక చికిత్స చేసుకొని షూటింగ్ సిద్దపడ్డారనే వార్త అందరికీ స్పూర్తిగా నిలిచింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.More Articles