అందం, అభినయం దండి ఉన్నప్పటికీ కొందరు ముద్దుగుమ్మలు స్టార్‌డమ్‌ను అందుకోవడంలో విఫలమవుతూ ఉంటారు. ఈ కోవలోకే వస్తారు పంజాబీ ముద్దుగుమ్మ పూనం బజ్వా. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తన ప్రస్థానం ప్రారంభించిన ఈ అందాల భామ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. కేవలం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ, హాట్ హాట్ ఫోటో‌షూట్‌లతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంటారు పూనం. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

Advertisement
Advertisement

విశాఖపట్నంలో స్థిరపడిన పంజాబీ కుటుంబంలో జన్మించారు పూనం బజ్వా. తొలుత మోడల్‌గా అదృష్టం పరీక్షించుకున్నారు. ఆమె అందం, క్యూట్ లుక్స్‌తో మేకర్స్ కళ్లలో పడ్డారు. 2005లో మొదటి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆపై రెండో సినిమాకే ఏకంగా బాస్ అనే మూవీలో కింగ్ నాగార్జున సరసన నటించే అవకాశం అందుకున్నారు పూనం బజ్వా. అనంతరం పరుగు, వేడుక తదితర సినిమాలో నటించారు. టాలీవుడ్‌లో తనకు అదృష్టం కలిసిరాకపోవడంతో ఇతర భాషల వైపు చూసింది ఈ ముద్దుగుమ్మ.

తెలుగు ప్రజలు మరిచిపోయిన పరిస్ధితుల్లో దాదాపు 10 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్‌‌లో ఆయన పెద్ద కుమార్తె గారపాటి లోకేశ్వరిగా నటించారు పూనమ్ బజ్వా. 20 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో నటించారు. తమిళ, మలయాళ భాషలలో కొంతమేర స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు పూనం. కానీ ఈ సక్సెస్‌ను ఆమె కంటిన్యూ చేయలేకపోయారు. 2022లో చివరిసారిగా మళయాళంలో పాథనోత్పం నూట్టండు, మే హూ మూసా.. తమిళ్‌లో గురుమూర్తి సినిమాల్లో నటించింది.

Advertisement

గత కొంతకాలంగా సినిమాలకు, నటనకు దూరంగా ఉంటున్న పూనం బజ్వా.. చాలాకాలం తర్వాత ఓ వెబ్‌సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారమవుతున్న ష్ సీజన్ 3లో ఆమె నటిస్తున్నారు. హాట్ హాట్ అందాలతో ఈ సిరీస్ ద్వారా కుర్రాళ్లను రెచ్చగొడుతున్నారు పూనం. ఇందులో ఆమె కామిని అనే పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

వయసు పెరుగుతుండటం, కొత్త అమ్మాయిల రాకతో పూనం బజ్వాకు అవకాశాలు తగ్గిపోయాయి. 40 క్రాస్ చేసినా ఇంకా సో లైఫ్‌‌ను లీడ్ చేస్తోంది. కొన్నేళ్ల క్రితం తెలుగు దర్శకుడు సునీల్ రెడ్డితో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రతినిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది పూనం. తన కెరీర్, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను పంచుకోవడంతో పాటు హాట్ హాట్ ఫోటోషూట్స్‌తో కుర్రాళ్లను రెచ్చగొడుతుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

వాటిలో బ్రౌన్ కలర్ టీ షర్ట్, బుల్లి నిక్కర్ ధరించి.. చేతులు రెండు పైకెత్తి నాభి, నడుము భాగాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు పూనం. ఈ గ్యాప్‌లో ఆమె ధరించిన చైన్ నడుము భాగంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలకు నెటిజన్లు టెస్లా బ్యూటీ బ్యాక్ విత్ ఫైర్ అంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్కేయండి.