టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్‌గా ఒకప్పుడు వెలుగొందారు ప్రసాద్ వీ పొట్లూరి (పీవీపీ). నిర్మాతగానే కాకుండా ఫైనాన్సియర్‌గానూ వ్యవహరించారు. అయితే టెంపర్ సినిమా సమయంలో మరో నిర్మాత బండ్ల గణేష్‌తో వివాదం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమా కోసం బండ్ల గణేష్ తన వద్ద 30 కోట్ల రూపాయలు రుణంగా తీసుకుని.. 23 కోట్ల రూపాయలు చెల్లించి, మిగిలిన 7 కోట్లు చెల్లించడం లేదంటూ పీవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే బండ్ల గణేష్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో వ్యవహారం కోర్టుల వరకు వెళ్లింది. అక్కడితో ఆగకుండా తనతో పెట్టుకుని గెలవలేవని, తన మనుషులను పంపించి బెదిరింపులకు దిగాడని పీవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ, రాజకీయ, వ్యాపార ప్రయాణంపై పీవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే...
ఫైనాన్సియర్‌గా నా దగ్గర కొన్ని వందల మంది డబ్బులు తీసుకుంటారు. పద్ధతి ఉన్నవాళ్లు కడతారు, పద్ధతి లేనివాళ్లు ఎగ్గొడతారు. ఈ విషయంలో నాకు నేను సమాధానం చెప్పుకోవాలి. నా జీవితం నేను బతుకుతాను, పక్కవాడి జీవితం సంగతి నాకెందుకు. పొద్దున్న 3 గంటలకు లేచి దొడ్లు కడిగి ఈ స్థాయికి చేరుకున్నా.. పక్కవాడు ఏదో ఒకటి అనుకుంటాడు అంటే నేను ఆ పనిచేయలేను కదా? నా జీవితం నా ఇష్టం, కష్టపడి పైకి వచ్చాను. చేతగానివాడిలా నేను మాట్లాడను.. వర్క్ చేసి చూపిస్తానని పీవీపీ తెలిపారు.
200 సినిమాలకు డబ్బులు నేను ఎవరి దగ్గరా తీసుకోలేదు.. నేను ఇచ్చాను. ఫైనాన్సియర్ అనే వాడు కూడా బ్యాంక్ లాంటివాడే. అప్పు ఇచ్చినవాడికి వసూలు చేసుకునే హక్కుంది. నేను ఆ సినిమాకు ఫైనాన్సియర్‌గా ఉన్నాను అని పీవీపీ వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో ఇన్వాల్వ్ కాలేదా? ఆయన చెబితేనే మీరు ఇన్వెస్ట్ చేశారని ఇండస్ట్రీ అనుకుంటోందని యాంకర్ ప్రశ్నించగా.. జూనియర్ ఎన్టీఆర్ అందులో హీరో వరకే, ఆయనకు.. దీనికి ఏం సంబంధం. నేను ఆ సినిమాకు సింగిల్ ఫైనాన్సియర్‌ని. మనం డబ్బులిచ్చి మనం పెంట వేసుకోలేం.. ఆ రీజన్‌తోనే సినీ పరిశ్రమ నుంచి తప్పుకున్నానని పీవీపీ వెల్లడించారు. ఇండస్ట్రీలో ఎవరినైనా కనుక్కోండి.. సెట్‌లో పెద్ద జోకర్ ఎవరంటే నిర్మాత. సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ జోకులు వేసేది నిర్మాత మీదే, డబ్బులు పెట్టేది ఎవరు నిర్మాతే, సినిమా సంకనాకిపోతే రోడ్డెక్కెది నిర్మాతే. అలాంటి ప్రొడ్యూసర్ ఎలా ఉండాలి. పశ్చిమ దేశాలలో నిర్మాత రేంజ్ వేరు.. కానీ మన ఇండస్ట్రీ స్టార్స్ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ మన డబ్బుకి, మన టైంకి విలువ లేనప్పుడు బుర్రలో గుజ్జు, మన గుండెలో దమ్ముంటే వందల వ్యాపారాలు చేసుకోవచ్చు అని పీవీపీ పేర్కొన్నారు. సినీ పరిశ్రమ నాకు సెట్ కాలేదు.. కానీ మరో 100 మందికి నప్పుతుంది. నాకు నప్పలేదు కాబట్టి నేను బయటకు వచ్చేసి వేరే పనిచేసుకుంటున్నాను. రాజకీయాల్లో నా ప్రమాణం కేవలం 3 వారాలే. ప్రజలకు సేవ చేద్దామని దిగాను.. 3 వారాల తర్వాత నాకు బాగా తెలిసింది ఏంటంటే రాజకీయాల్లోకి దిగుదామని అనుకున్నాను తప్ప, నేను రాజకీయవేత్తను కాదు. ఎన్నికల్లో నా డబ్బు నేను ఖర్చుపెట్టుకుంటాను. పబ్లిక్ అఫిడవిట్ అనేది భారతదేశ చరిత్రలో ఒక జోక్ అయిపోయింది, దేశంలోని రాజకీయ నాయకుల అఫిడవిట్‌లను మంచిన జోక్ మరొకటి లేదు అని పీవీపీ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి.More Articles