భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో రామాయణ కూడా ఒకటి. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రణబీర్ కపూర్, సాయిపల్లవి, యశ్, కాజల్ అగర్వాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలై చేసిన గ్లింప్స్, నటీనటుల లుక్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో ఈ మూవీ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో రామాయణ చిత్ర యూనిట్ షాకిచ్చింది.

Advertisement

ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ బ్యానర్స్‌పై నమిత్ మల్హోత్రా ఈ రామాయణ సినిమాను నిర్మిస్తుండగా నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. రణబీర్ కపూర్, సాయిపల్లవి, రవి దూబే, సన్నీ డియోల్, యశ్, అమితాబ్ బచ్చన్, లారా దత్తా, అరుణ్ గోవిల్, ఇందిరా కృష్ణన్, వివేక్ ఒబెరాయ్, శిశిర్ శర్మ, మోహిత్ రైనా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తోంది. పంకజ్ కుమార్, మహేశ్ లిమాయేలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని, హ్యాన్స్ జిమ్మర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించనున్నారు.

Advertisement

భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారిగా 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రామాయణను తెరెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళి కానుకగా 2026 నవంబర్ 6న విడుదల చేయనున్నారు. రామాయణ విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను బ్రిటీష్ ఇండియన్ స్టూడియో డీఎన్ఈజీ చేపట్టడం విశేషం. ప్రపంచ ప్రఖ్యాత జర్మన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన హ్యాన్స్ జిమ్మర్ ఈ సినిమాతో భారతీయ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతుండటం విశేషం.