ప్రముఖ నిర్మాత సీ అశ్వినీదత్ సమర్పణలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి వస్తున్న జయకృష్ణ ఘట్టమనేని, పాపులర్ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడానీ జంటగా రూపొందిన ఈ చిత్రం శ్రీనివాస మంగాపురం. RX 100 ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, స్వర్గీయ రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని చందమామ కథలు బ్యానర్‌పై జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: జీవి ప్రకాశ్, సినిమాటోగ్రఫి: జయకృష్ణ గుమ్మడి, ఎడిటర్: మాధవ్ కుమార్ గుల్లపల్లి, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్ తదితరుల తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమాజూలై 30వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..
యాక్షన్, ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో జయకృష్ణ, రషా తడానీ ఇద్దరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. శ్రీనివాస్, మంగా ఇద్దరు తమ పాత్రల్లో ఒదిగిపోయినట్టు స్పష్టమైంది. నటనకు కొత్త అనే ఫీలింగ్ మాత్రం ట్రైలర్ చూస్తే అనిపించదు. ఇద్దరు చాలా కష్టపడి.. ప్రాణం పెట్టి పాత్రల్లో జీవించారనే విషయం కనిపించింది. ఈ చిత్రంలో అజయ్ భూపతి మార్క్ ప్రేమ కథ మాత్రమే కాకుండా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఇక ఇప్పటి వరకు ఎన్నో పాత్రల ద్వారా లెజెండరీ యాక్టర్‌గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న డాక్టర్ మోహన్ బాబు మరోసారి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించడమే కాకుండా రౌద్ర రసంతో కేక పెట్టించారు. బళ్లారి వెంకటప్పయ్య నాయుడిదే అంటూ తన పాత్ర ద్వారా ఛాలెంజ్ విసిరాడు. మరోసారి నట విశ్వరూపం చూపించబోతున్నాడా? అనే ఫీలింగ్‌ను కల్పించాడు. ఇక యాక్షన్ పరంగా ఈ సినిమా గ్రిప్పింగ్‌గా ఉండబోతుంది. అజయ్ భూపతి తన మార్కు వయోలెంట్ లవ్ స్టోరిని చెప్పబోతున్నాడు అనే విషయం ట్రైలర్‌లో కనిపించింది. ఈ సినిమాలో నటీనటుల ఎంపిక ఆసక్తిని రేపింది. ఈ సినిమా యూత్‌ఫుల్ లవ్ స్టోరీలో మరో ట్రెండ్ సెంటర్ అవుతుందా? అనే ఫీలింగ్‌ను కలిగించింది.More Articles