హాలీవుడ్‌లో పాపులర్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్, ఫాంటసీ చిత్రం ది ఒడిస్సీ. ఈతాకా గ్రీక్ సమ్రాజ్యాధినేత ఒడిస్సీ జీవితంలో జరిగిన కీలక సన్నివేశాలను ఆధారంగా చేసుకొని ట్రోజాన్ వార్ తర్వాత చోటు చేసుకొన్న సంఘటలన నేపథ్యంగా ఈ సినిమాను రూపొందించారు. ఒడిస్సీగా మాట్ డామన్, ఆయన భార్య పెనెలోప్ పాత్రలో అన్నె హత్‌వే నటించారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్, రాబర్ట్ పాటిన్‌సన్, సమంత మార్టన్, జెండ్యా, చార్లీజ్ థెరాన్ నటించారు. ఈ సినిమాను ఎమ్మా థామస్, క్రిస్టఫర్ నోలన్ నిర్మించారు.
ఈ మూవీ సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: హోయతే వాన్ హోయ్‌తేమ, ఎడిటర్: జెన్నిఫర్ లామే, మ్యూజిక్: లడ్‌విగ్ గోరాన్సన్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. యూనివర్సల్ పిక్చర్స్ , సింకోపి బ్యానర్లపై రూపొందించిన ఈ చిత్రం ఇండియాలో, ఇతర దేశాల్లో జూలై 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఇండియాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) పూర్తి చేసింది. ఈ సినిమాలోని సన్నివేశాలు, డైలాగ్స్‌పై ఏమైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయా? ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ ఏమిటి? సెన్సార్ తర్వాత ఈ సినిమాపై వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
ది ఒడిస్సీ సినిమా కథ విషయానికి వస్తే.. గ్రీక్ సామ్రాజ్య విస్తరణలో భాగంగా సుదీర్ఘంగా సాగిన ట్రోజాన్ వార్ తర్వాత ఇంటికి చేరి భార్య పెనెలోప్‌ను కలిసిన తర్వాత చోటు చేసుకొన్న సంఘటనలు, గ్రీకులు ఆరాధ్యంగా భావించే పాలిఫేమస్, సిరెన్, నింప్ కాలిప్సో దేవుళ్లతో జరిగిన మానసిక సంఘర్షణ అంశాలుగా ఈ సినిమాను కథను తెరకెక్కించారు. ఒడిస్సీ, తన భార్య మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని ఇటీవల సెన్సార్ బోర్డు సభ్యులు, ప్రతినిధుల బృందం వీక్షించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే కథ, కథనాలు డిమాండ్ నేపథ్యంలో ఎలాంటి మార్పులు చేయడానికి అంగీకరించకపోవడంతో ఈ సినిమాకు A సర్టిఫికెట్ జారీ చేశారు. అంతేకాకుండా ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఈ సినిమా జూలై 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కావడానికి లైన్ క్లియర్ అయింది. అయితే సెన్సార్ తర్వాత ఈ సినిమాపై వచ్చిన రూమర్లకు క్లారిటీ వచ్చేసింది. ఇతర దేశాల్లో ప్రదర్శించే సినిమానే ఇండియాలో కూడా చూడబోతున్నారు. ఇండియన్ వెర్షన్ సినిమాలో చాలా కట్స్ వేశారు. ఓవర్సీస్‌లో స్క్రీన్ అయ్యే వెర్షన్ రన్ టైమ్ ఇండియాలో చూపించే సినిమా నిడివి వేర్వేరుగా ఉంటాయనే విషయంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే సెన్సార్ తర్వాత ఒకే వెర్షన్ సినిమాను అంతటా రిలీజ్ చేస్తున్నారనే విషయం ఆడియెన్స్‌కు ఊరట లభించింది. ముంబైలో ఈ సినిమా ప్రీమియర్‌ను నోలన్, టామ్ హలెండ్, అన్నే హత్‌వే సమక్షంలో మీడియాకు ప్రదర్శించారు. ఈ సినిమా గురించి క్రిటిక్ తన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెడుతూ.. సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న అద్బుతమైన సినిమాను క్రిస్టఫర్ నోలన్ అందించాడు. వెండితెర మీద తొలిసారి కొత్త అనుభూతికి గురయ్యాను. ఈ మూవీ స్కేల్, ఎమోషన్స్, విజువల్ గ్రాండియన్, కథ చెప్పిన విధానం బాగుంది. ఈ సినిమా ప్రయాణం ఓ మ్యాజిక్ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో అద్బుతం. ప్రతీ క్షణం, ప్రతీ సన్నివేశం ఉత్కంఠకు గురి చేస్తుంది. మాట్ డామన్, అన్నా హత్‌వే, టామ్ హాలెండ్, రాబర్ట్ పాటిన్‌సన్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.More Articles