జగన్ పుట్టిన రోజున వైఎస్ఆర్ రాక.. విడుదల తేదీ ఖరారు!


వైఎస్ఆర్ జీవితంలో కీలక ఘట్టాల ఆధారంగా యాత్ర చిత్రం రూపొందుతోంది. వైఎస్ఆర్ బయోపిక్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాపై సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజగా ఈ చిత్ర విడుదల తేదీ ఖరారు చేశారు.

వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21 న యాత్ర చిత్రం విడుదల కానుంది. ఈ మేరకు విడుదుల తేదీ ఖరారు చేసారు. వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు.

ఈ చిత్రంలో భూమిక, రావు రమేష్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైఎస్ఆర్ రాజకీయ జీవితం, ఆయన పాదయాత్ర ద్వారా ప్రజాసమస్యలని తెలుసుకున్న విధానం, ఆతరువాత ఏపీ ముఖ్యమంత్రిగా ఎదిగిన ఘట్టాలని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

Have a great day!
Read more...

English Summary

YSR Biopic movie Yatra release date fixed. This movie is releasing on December 21 on the occasion of YS Jagan birthday.