Bigg Boss Telugu 8: శేఖర్ బాషా ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. తండ్రైన వెంటనే బంపర్ ఆఫర్

ఎటువంటి పరిస్థితుల్లో బుల్లితెరపైకి వచ్చినా ప్రేక్షకుల ఆదరాభిమానాలను దక్కించుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతున్నదే బిగ్ బాస్. చిత్ర విచిత్రమైన టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య కొట్లాటలు.. కోల్డ్ వార్‌లు.. ప్రేమ వ్యవహారాలు.. రొమాంటిక్ సన్నివేశాలు వంటివి చూపిస్తూ నిర్వహకులు దీనిపై ఆసక్తిని మరింతగా పెంచుతున్నారు. దీంతో ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో సీజన్ రంజుగా సాగుతోంది. ఇక, ఇందులో శేఖర్ బాషా ఎలిమినేషన్‌పై తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసమే!

క్రేజీ కంటెంట్‌తో 8వ సీజన్
తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షోకు మించిన ఆదరణ మరే దానికి రావడం లేదన్నదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇది వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 8వ సీజన్‌ను క్రేజీ కంటెంట్‌తో నడిపిస్తున్నారు. దీంతో దీనికి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఇది మళ్లీ భారీ రేటింగ్‌ను రాబడుతోంది.

Bigg Boss Telugu 8 Contestant Shekar Basha Elimination Reason Revealed

14 మందిలో ఆమె అవుట్

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌ భారీ అంచనాలతో వచ్చింది. ఇందులోకి ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీళ్ల నుంచి మొదటి వారంలో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిపోయింది.

రెండో వారంలో 8 మంది
బిగ్ బాస్ 8వ సీజన్ నామినేషన్స్ మాత్రం చాలా గొడవలతో రసవత్తరంగా సాగుతున్నాయి. ఇలా రెండో వారంలో మరింత ఎక్కువగానే ఇవి కనిపించాయి. ఎంతో రంజుగా సాగిన ఈ ప్రక్రియలో 8 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో నిఖిల్, విష్ణుప్రియ భీమనేని, కిర్రాక్ సీత, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, శేఖర్ బాషా, నైనికలు నామినేట్ అయిపోయారు.

ఈసారి బాషా ఎలిమినేట్

బిగ్ బాస్ షోకు సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ఎంతో రహస్యంగా జరిగే వ్యవహారమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా ఇది ఒకరోజు ముందుగానే షూటింగ్ జరుపుకోవడంతో సమాచారం మొత్తం లీక్ అవుతోంది. ఇక, ఎనిమిదో సీజన్ 2వ వారంలో శేఖర్ బాషా ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చేసింది. దీంతో అతడి ఫ్యాన్స్ షాక్‌లో ఉన్నారు.

అందుకే ఎలిమినేషన్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో శేఖర్ బాషా తనదైన కామెడీ పంచులతో మెప్పిస్తున్నాడు. దీంతో అతడు సోషల్ మీడియాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో శేఖర్ బాషాను ఎలిమినేట్ చేశారు. దీంతో అతడికి గత వారంలో ఓటింగ్ ఎక్కువగానే వచ్చినప్పటికీ.. రీసెంట్‌గా తండ్రి అవడం వల్లే బయటకు పంపించేశారని అంటున్నారు.

బంపర్ ఆఫర్ ఇచ్చారు

ఎనిమిదో సీజన్‌లో ముందుగా 14 మందిని హౌస్‌లోకి పంపించారు. కానీ, ఆ తర్వాత మరికొందరిని హౌస్‌లోకి పంపుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రెండో వారంలో ఎలిమినేట్ అయిన శేఖర్ బాషాను కూడా మళ్లీ హౌస్‌లోకి తీసుకు రాబోతున్నారట. ఇప్పటికే అతడికి ఈ విషయాన్ని చెప్పారని సమాచారం. గత సీజన్‌లో రతికాను కూడా అలాగే పంపిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X