Raj Kundra: విడుదలైనా చిక్కుల్లో.. ఫోన్‌లో 119 పోర్న్ వీడియోలు, వాటితో కోట్ల రూపాయల షాకింగ్ డీల్స్!

అశ్లీల చిత్రాల కేసులో ఇరుక్కున్న శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ఎట్టకేలకు సెప్టెంబర్ 21 న అంటే ఈరోజున సుమారు రెండు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. సోమవారం, మెజిస్ట్రేట్ కోర్టు అతనికి రూ .50 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు 64 రోజులు జైల్లో గడిపిన తర్వాత, రాజ్ విడుదలయ్యారు, అయితే ముంబై పోలీసులు ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

2 నెలల తర్వాత బెయిల్‌పై

2 నెలల తర్వాత బెయిల్‌పై

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా 2 నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. జూలై 19 న అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. గత 2 నెలల్లో, రాజ్ తన బెయిల్ కోసం చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నారు, కానీ ప్రతిసారి అతని దరఖాస్తు తిరస్కరించబడుతూనే వచ్చింది, కానీ ఇప్పుడు జూలై 20న 2 నెలల తర్వాత, రాజ్‌కు బెయిల్ వచ్చింది, దీంతో ఆయన ఈ రోజు విడుదలయ్యాడు.

లుక్ అవుట్ సర్క్యులర్

లుక్ అవుట్ సర్క్యులర్

ఇక మరో పక్క పరారీలో ఉన్న నిందితుడు యశ్ ఠాకూర్ అలియాస్ అరవింద్ శ్రీవాస్తవ, రాజ్ కుంద్రా బావ ప్రదీప్ బక్షిపై ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు ముంబై పోలీసులు. ఇక రాజ్ అసభ్యకరమైన సినిమాలు తీసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని మరియు వాటిని యాప్‌లలో అప్‌లోడ్ చేస్తున్నారనే ఆరోపణలతో అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

కలత చెందినట్లు

కలత చెందినట్లు

ఇక ఈరోజు రాజ్ జైలు నుంచి బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు బయటపడ్డాయి, ఈ ఫోటోలలో రాజ్ చాలా అతను చాలా కలత చెందినట్లు కనిపిస్తున్నారు. అలాగే మీడియా చూస్తున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. ఫోటోలలో, రాజ్ తెల్లటి టీ షర్టు మరియు డెనిమ్ జీన్స్‌లో కనిపిస్తున్నారు. అలాగే ఆ సమయంలో తన నుదిటిపై తిలకం కూడా పెట్టుకున్నాడు, దాని కారణంగా అతను మళ్ళీ ట్రోల్ చేయబడ్డాడు. ఇక వీడియోలు మరియు ఫోటోలలో రాజ్ ముఖంలో ఇబ్బంది మరియు బాధ స్పష్టంగా కనిపిస్తుంది.

మీడియాతో మాట్లాడకుండానే

మీడియాతో మాట్లాడకుండానే

ఇక రాజ్ జైలు నుంచి బయటకు వచ్చి కారులో కూర్చునే వరకు రాజ్ మీడియాతో సంభాషించలేదు. రాజ్‌తో పాటు, అతని సహచరులలో ఒకరైన ర్యాన్ థోర్ప్ కూడా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ర్యాన్‌కు కూడా బెయిల్ వచ్చింది. ఈ కేసులో పోలీసులు దాదాపు 1500 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, ఇందులో 43 మంది స్టేట్‌మెంట్‌లు నమోదు చేయబడ్డాయి. సాక్షులలో రాజ్ భార్య శిల్పా శెట్టి మరియు నటి షెర్లిన్ చోప్రా కూడా ఉన్నారు.

Recommended Video

Allu Arjun Changes Hotel Owner's Fate || Filmibeat Telugu
షాకింగ్ గా వీడియోలు

షాకింగ్ గా వీడియోలు

రాజ్ బెయిల్‌పై ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ, అతనికి ఇబ్బందులు తగ్గలేదు. దానికి కారణం పోలీసులు 119 అసభ్యకరమైన వీడియోలను రాజ్ ఫోనులో కనుగొన్నారు. రాజ్ వాటిని విక్రయించడానికి రాజ్ ప్లాన్ చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. వార్తా సంస్థ ANI ప్రకారం, ముంబై పోలీసులు, "విచారణలో, రాజ్ యొక్క మొబైల్, ల్యాప్‌టాప్ మరియు హార్డ్ డ్రైవ్ నుంచి పోలీసులు 119 అసభ్యకరమైన వీడియోలు కనుగొన్నారు. రాజ్ ఈ వీడియోలను రూ .9 కోట్లకు విక్రయించాలని యోచిస్తున్నారు అని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X