కియారా అద్వానీ పెళ్లి వేదిక ప్యాలెస్ ప్రత్యేకతలు.. రోజుకు అన్ని కోట్లు! అతిథులు ఎంతమంది అంటే?

తెలుగులో మంచి క్రేజ్ సంపాందించుకున్న హిందీ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో బాలీవుడ్ బ్యూటి కియారా అద్వానీ ఒకరు. భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటి సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించి ఆకట్టుకుంది. అనంతరం రామ్​ చరణ్​తో వినయ విధేయ రామ మూవీలో హాట్ గా సందడి చేసిన ఈ బ్యూటి హిందీలో పలు సక్సెస్ ఫుల్ చిత్రాలతో ఆకట్టుకుంది. ఇక షేర్షా సినిమా ద్వారా బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో అయిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ ప్రేమే ఇప్పుడు పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది. ఫిబ్రవరి 6న కియారా అద్వానీ వివాహం జరగనుండగా.. కల్యాణ వేదిక అయిన సూర్యఘర్ ప్యాలెస్ హోటల్ కు ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే.

ప్రీవెడ్డింగ్ పనులు షురూ..

ప్రీవెడ్డింగ్ పనులు షురూ..

బాలీవుడ్ లవ్ బర్డ్స్ గా పిలుస్తున్న కియారా-సిద్ధార్థ్ ల వివాహం ఫిబ్రవరి 6న జరగనుంది. అందుకు రాజస్థాన్ లోని జైసల్మీర్ ప్రాతంలో ఉన్న సూర్యఘర్ ప్యాలెస్ హోటల్ వేదికగా మారనుంది. కియారా, సిద్ధార్థ్ ఫిబ్రవరి 6న మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుండగా.. అప్పుడే ప్రీవెడ్డింగ్ పనులు మొదలయ్యాయి. కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా ప్రీ వెడ్డింగ్ పనులు ఫిబ్రవరి 4 అంటే ఇవాళ స్టార్ట్ అయ్యాయి. ఫిబ్రవరి 4, 5 తేదిలలో హల్దీ, మెహందీ, సంగీత్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

సూర్యఘర్ ప్యాలెస్ ప్రత్యేకతలు..

సూర్యఘర్ ప్యాలెస్ ప్రత్యేకతలు..

హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లి కార్యక్రామాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇక ఈ జోడి మెహందీ కోసం ప్రముఖ సెలబ్రిటీ మెహందీ ఆర్టిస్ట్ వీణ నగ్దా శుక్రవారమే రాజస్థాన్ చేరుకున్నారు. ఇదిలా ఉంటే ఈ జంట పెళ్లి కోసం జైసల్మేర్ లోని రాయల్ సూర్యఘర్ ప్యాలెస్ హోటల్ ను బుక్ చేసుకున్నారు. ఈ వేదికకు అయ్యే ఖర్చు, దాని ప్రత్యేకతలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అలాగే ఈ బాలీవుడ్ జంట పెళ్లికి ఎంతమంది వస్తున్నారనే విషయం కూడా ఆసక్తిగా మారింది.

 సూర్య కిరణాలు పడే విధంగా..

సూర్య కిరణాలు పడే విధంగా..

పెళ్లికి వచ్చే వీవీఐపీలకు భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. జైసల్మేర్ నుంచి సూర్యఘర్ ప్యాలేస్ కు 16 కి.మీ దూరం ఉంది. ఈ హౌటల్ ను 2010 డిసెంబర్ లో జైపూర్ కు చెందిన ఒక వ్యాపారవేత్త కట్టించారు. దాదాపుగా 65 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ హోటల్ ను జైసల్మేర్ లోని పసుపు రాళ్లతో నిర్మించారు. సూర్య కిరణాలు ప్యాలెస్ పై పడే విధంగా వెరైటీగా నిర్మించారట. ప్రపంచంలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ లకు ఈ ప్యాలెస్ చాలా పాపులర్.

 అందుకోసం ఖాళీ ప్రదేశం..

అందుకోసం ఖాళీ ప్రదేశం..

సూర్యఘర్ ప్యాలెస్ లో బావడి అనే ప్రత్యేక ప్రదేశం ఉంది. అందులోనే నూతన వధూవరులు బస చేయడం జరుగుతుంది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం కోసం ప్రత్యేకమైన మండపం ఏర్పాటు చేశారట. పెళ్లి వీక్షించేందుకు అతిథుల కోసం స్పెషల్ సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ హోటల్ ఒకవైపు సరస్సు, మరోవైపు తోటలు ఉండటం ప్రత్యేకత. పెళ్లికి ముందు సంగీత్, హల్దీ నిర్వహించుకునేందుకు ఖాళీ ప్రదేశాన్ని కూడా ఉంచారట.

రోజుకు రూ. 20 లక్షలు..

రోజుకు రూ. 20 లక్షలు..

ఈ సూర్యఘర్ ప్యాలెస్ లో మొత్తం 84 గదులు, 92 బెడ్రూమ్ లు, 2 గార్డెన్ లు, ఆర్టిఫిషియల్ సరస్సుతోపాటు జిమ్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, విల్లాలు, రెస్టారెంట్ లు అతిథులకు అందుబాటులో ఉంటాయట. అలాగే ఆకట్టుకునే శిల్పాలతో పాటు రిచ్ గా ఉండే ఇంటీరియర్స్ అతిథులకు ఎంతగానో ఆహ్లాదాన్ని ఇస్తాయట. ఈ ప్యాలెస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కు రోజుకు రూ. 20 లక్షలు తీసుకుంటారట. అది కూడా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలలో మాత్రమే.

 అలాంటి సమయంలో 2 కోట్లు..

అలాంటి సమయంలో 2 కోట్లు..

అక్టోబర్ నుంచి మార్చి వరకు టూరిస్ట్ సీజన్ లో బుకింగ్ కోసం రోజుకు సుమారు రూ. 2 కోట్లు వసూళు చేస్తున్నారట. ఈ పెళ్లిలో అతిథులకు మద్యం లేకుండా పార్టీని అరేంజ్ చేస్తున్నారట. గెస్ట్ లకు రాజస్థానీ సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతారు. ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలతో పాటు మొత్తం 150 మంది వీవీఐపీలను మాత్రమే కియారా-సిద్ధార్థ్ పెళ్లికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వీరిలో షాహిద్ కపూర్, కరణ్ జోహార్, వరుణ్ ధావన్ వంటి ప్రముఖులు ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X