For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒకే కారులో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్.. ఆ దర్శకుడితో కలిసి రొమాంటిక్‌గా

  |

  బాలీవుడ్‌లో రోడ్ మూవీస్‌‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన దర్శకుల్లో ఫరాన్ అఖ్తర్ టాప్ వరుసలో ఉంటారు. కారులో ముగ్గురు హీరోలను ప్రయాణించే కథతో యూత్‌ను ఆకట్టుకోవడంలో ఫరాన్ మంచి ట్రాక్ రికార్డును సొంతం చేసుకొన్నారు. తాజాగా మరో రోడ్ మూవీతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ సారి డిఫరెంట్‌గా ప్రియాంక చోప్రా జోనస్, కత్రినా కైఫ్, ఆలియా భట్ కలిపి రోడ్ మూవీని పరిగెత్తించేలా చేస్తున్నారు. గతంలోని ఆయన రూపొందించిన రోడ్ మూవీస్ విషయంలోకి వెళితే..

  అంతకు మించిన అందంతో సురేఖవాణి.. కూతురుతో కలిసి ఆ రేంజ్ రచ్చ!

  20 ఏళ్ల దిల్ చాహ్త హై

  20 ఏళ్ల దిల్ చాహ్త హై

  ఫర్హాన్ అఖ్తర్ తొలిసారి దర్శకత్వం వహిస్తూ 2001లో అమీర్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్, అక్షయ్ ఖన్నా జతచేసి కారులో కూర్చోపెట్టి గోవాకు పరిగెత్తించారు. గోవాలో వారి స్నేహబంధం, అపోహలు, అపార్థాలను చక్కగా తెరకెక్కించారు. గోవాలోని అద్బుత లొకేషన్లను ఆహా అనిపించేలా అనుభూతిని ఫర్హాన్ కలిగించారు. ఆ సినిమా ఎంతటి విజయం సాధించింది.. ఆ సినిమా పేరు దిల్ చాహ్త హై అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దిల్ చాహ్త హై సినిమాను 8 కోట్ల వ్యయంతో తెరకెక్కిస్తే.. అప్పట్లోనే 50 కోట్ల వరకు వసూలు చేసింది. 2001 ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అయిన చిత్రం నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకొన్నది.

  Kareen Kapoor top controversies.. ఎవరితో అఫైర్, ఎవరితో డేటింగ్.. సైఫ్‌‌తో పెళ్లి తర్వాత ఆస్తి ఎంతంటే

  జిందగి నా మిలేగి దొబారా మూవీతో

  జిందగి నా మిలేగి దొబారా మూవీతో

  ఇక సరిగ్గా పదేళ్ల తర్వాత అంటే 2011లో మళ్లీ పర్హాన్ అఖ్తర్ మరో రోడ్ సినిమాతో ప్రేక్షకు ముందుకు వచ్చాడు. కానీ ఇండియాను వేదికగా చేసుకోలేదు. ఏకంగా స్పెయిన్‌లో హృతిక్ రోషన్, ఫర్హాన్ అఖ్తర్, అభయ్ డియోల్ హంగామా చేశారు. బుల్ ఫైట్స్, ఆకాశం నుంచి ఫ్లయిట్‌లో గాలిలోకి దూకే సన్నివేశాలు, ప్రేమ, విభేదాలు, ఫ్రెండ్ షిప్, బ్రేకప్స్ లాంటి అంశాలతో జిందగి నా మిలేగి దొబారా మూవీతో మరోసారి ప్రేక్షకులు ఉర్రూతలూగించారు. కేవలం సక్సెస్‌నే కాకుండా బాక్సాఫీస్ వద్ద హల్‌చల్ చేశాడు ఫర్హాన్ అఖ్తర్. 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే.. 160 కోట్ల వసూళ్లను సాధించింది.

  Kareena Kapoor Khan రెండో కొడుకు పేరు వివాదంగా.. ఏం పేరు పెట్టారు? ఎందుకు ట్రెండ్ అవుతున్నదంటే?

  ప్రియాంక, కత్రినా, ఆలియా భట్ తో

  ప్రియాంక, కత్రినా, ఆలియా భట్ తో

  ప్రస్తుతం మళ్లీ పదేళ్ల తర్వాత అంటే 2021లో ముగ్గురు హాట్ అండ్ టాప్ హీరోయిన్లతో జీ లే జెరా టైటిల్‌తో ఫర్హాన్ అఖ్తర్ మరో రోడ్ మూవీ ప్లాన్ చేశాడు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనస్, కత్రినా కైప్, ఆలియా భట్ నటిస్తున్నారు. వీరంతా కారులో రొమాంటిక్‌గా షికారు చేయనున్నారు. ఈ చిత్రానికి ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వం వహిస్తుండగా. జోయా అఖ్తర్, ఫర్హాన్ అఖ్తర్, రీమా కంగ్తీ కథ, డైలాగ్స్, సాహిత్యం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రీమా కంగ్తీ, జోయా అఖ్తర్, రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అఖ్తర్ నిర్మిస్తున్నారు.

  ఆ ముగ్గురితో రోడ్ ట్రిప్‌కు తొందరపడుతున్నా

  దిల్ చాహ్త హై సినిమా రిలీజై 20 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా జీ లే జరా చిత్రాన్ని ప్రకటించారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నది. ఈ టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. దిల్ చాహ్త హై 20 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా జీ లే జరా సినిమాను ఎనౌన్స్ చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది అని ఫర్హాన్ అఖ్తర్ ట్వీట్ చేశారు. ప్రియాంక, అలియా, కత్రినా కైఫ్‌తో ఈ రోడ్ ట్రిప్‌కు వెళ్లడానికి చాలా తొందరపడుతున్నాను అంటూ పేర్కొన్నారు.

  Farhan Aktha - Definitely Will Act If The Opportunity Arises To Act In Tollywood | Filmibeat Telugu
  జీ లే జారా కోసం ఆతృతగా ఉందని ప్రియాంక చోప్రా

  జీ లే జారా కోసం ఆతృతగా ఉందని ప్రియాంక చోప్రా

  ఫర్హాన్ అఖ్తర్ షేర్ చేసిన జీ లే జరా మూవీ టీజర్‌పై ప్రియాంక చోప్రా, ఆలియాభట్, కత్రినా కైఫ్ స్పందించారు. ఈ రోడ్ ట్రిప్‌కు వెళ్లడానికి చాలా ఆసక్తిగా ఉందని ప్రియాంక అంటే.. ఈ రోడ్ ట్రిప్ కోసం రెడీనా అంటూ ఆలియాభట్ ట్వీట్ చేసింది. త్వరలోనే ఈ ముగ్గురు భామలు కారు ప్రయాణాన్ని థ్రిల్లింగ్‌గా ఆరంభిస్తారని ఆశిద్దాం.

  English summary
  Farhan Akhtar's debut as director movie Dil Chahta Hai finishes 20 years. In this occassion, Farhan Akhtar annouces Jee Le Zaraa with Priyanka Chopra Jonas, Katrina Kaif, Alia Bhatt.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X