twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2018లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్... ఎన్నికోట్ల నష్టం అంటే?

    |

    2018 సంవత్సరం సినీ రంగానికి కొన్ని తీపి గుర్తులతో పాటు కొన్ని చేదు అనుభవాలు మిగిలాయి. పలువురు పెద్ద స్టార్స్ నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద దారుణమైన పరాజయం పాలయ్యాయి. ఈ లిస్టులో అతిపెద్ద డిజాస్టర్‌గా నెం.1 స్థానం దక్కించుకుంది అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ నటించిన 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'.

    మరో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన 'రేస్ 3' సైతం అభిమానులకు తీవ్ర అసంతృప్తిని మిగల్చడంతో పాటు అటు డిస్ట్రిబ్యూటర్లను ముంచేసింది. ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ డిజాసర్లుగా నిలిచిన చిత్రాలు ఏమిటో ఓ లుక్కేద్దాం....

    2018 బాక్సాఫీస్ రిపోర్ట్: వసూళ్లలో టాప్ సినిమాలు ఇవే, టాలీవుడ్ ఆధిపత్యం! 2018 బాక్సాఫీస్ రిపోర్ట్: వసూళ్లలో టాప్ సినిమాలు ఇవే, టాలీవుడ్ ఆధిపత్యం!

    థగ్స్ ఆఫ్ హిందూస్తాన్

    థగ్స్ ఆఫ్ హిందూస్తాన్

    2018లో బాలీవుడ్లో మాత్రమే కాదు... ఇండియన్ సినీ పరిశ్రమలో నెం.1 డిజాస్టర్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్2. అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైణ్, ఫాతిమా సనా షేక్ నటించిన ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలింస్ బేనర్లో ఆదిత్య చోప్రా రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. అయితే బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కేవలం రూ. 262 కోట్లు గ్రాస్ మాత్రమే రాబట్టింది.

     రేస్ 3

    రేస్ 3

    సల్మాన్ ఖాన్, బాబీ డియోల్, అనిల్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన భారీ యాక్షన్ మూవీ ‘రేస్ 3'. రెమో డిసౌజా దర్శకత్వంలో రమేస్ ఎస్ తౌరానీ నిర్మించి ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద చతికిల పడింది. రూ. 185 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 170 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది.

    నమస్తే ఇంగ్లండ్

    నమస్తే ఇంగ్లండ్

    అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టెనర్ ‘నమస్తే ఇంగ్లండ్' ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. రూ. 54 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 10 కోట్లు కూడా రాబట్టలేక పోయింది. విపుల్ అమృతల్ షా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ నిర్మించింది.

    బట్టి గుల్ మీటర్ చాలు

    బట్టి గుల్ మీటర్ చాలు

    షాహిద్ కపూర్, శ్రద్ధా కపూర్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘బట్టి గుల్ మీటర్ చాలు' బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు రాబట్టలేక పోయింది. శ్రీనారాయణ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమర్ నిర్మించారు. రూ. 49 కోట్లతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 37 కోట్లు మాత్రమే రాబట్టింది.

    అయ్యారీ

    అయ్యారీ

    సిద్ధార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్ పాయ్, పూజా చోప్రా ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘అయ్యారీ' చిత్రం సైతం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. రూ. 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 18 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది.

     ఫన్నే ఖాన్

    ఫన్నే ఖాన్

    ఐశ్వర్యరాయ్, అనిల్ కపూర్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘ఫన్నే ఖాన్' సైతం ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. అతుల్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని భూషణ్ కుమార్, అనిల్ కపూర్, కృషన్ కుమార్ నిర్మించారు. రూ. 39 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయగా రూ. 10 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

    పల్టాన్

    పల్టాన్

    జేపీ దత్తా దర్శకత్వంలో రూపొందిన వార్ ఫిల్మ్ ‘పల్టాన్' సైతం బాక్సాఫీసు వద్ద బొల్తా పడింది. జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంంలో జాకీ ష్రాఫ్, అర్జున్ రాంపాల్, సోనూ సూద్, గుర్మీత్ చౌదరి, హర్ష వర్దన్ రాణె కీలక పాత్రలు పోషించారు. రూ. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 8 కోట్లకు మించి రాబట్టలేకపోయింది.

    హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ

    హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ

    డయానా పెంటీ, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రల్లో రూపొందిన కామెడీ చిత్రం ‘హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ' చిత్రాన్ని కూడా ప్రేక్షకులు తిప్పికొట్టారు. ముదాసర్ అజీజ్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని రూ. 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించగా కేవలం రూ. 20 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

    కాలాకండి

    కాలాకండి

    సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన డార్క్ కామెడీ చిత్రం ‘కాలాకండి'. అక్షత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సినీస్థాన్ ఫిల్మ్ కంపెనీ రూ. 18 కోట్ల బడ్జెట్‌తో రూపొందించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 5 కోట్లు మాత్రమే రాబట్టింది.

    ఒమెర్టా

    ఒమెర్టా

    హన్సల్ మెహతా దర్శకత్వంలో రూపొందిన బయోగ్రాఫికల్ చిత్రం ‘ఓమెర్టా'. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు... అహ్మద్ సయీద్ షేక్ అనే టెర్రరిస్ట్ పాత్రలో నటించాడు. రూ. 12 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 3 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

    English summary
    Thugs Of Hindostan was a period film and one of the biggest releases in India's as well the biggest Bollywood disasters this year. The film released amid great expectations but the film didn't do well at the box office and became a failure. The film was produced with a whopping budget of Rs 350 crores but collected Rs 262 crores from across the world.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X