ఖాన్ త్రయం లేకుండానే 2020 గడిచిపోయింది.. నిజంగా ఇది ఆశ్చర్యమే!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఒక హీరో డామినేషన్ తప్పకుండా ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద ఊహించని రికార్డులు క్రియేట్ చేస్తూ నెక్స్ట్ రాబోయే హీరోలకు చాలెంజ్ విసురుతూ ఉంటారు. ఇక ఈ ఏడాది మాత్రం పెద్దగా బాక్సాఫీస్ ఫైట్స్ ఏమి జరగలేదు. ముఖ్యంగా ఖాన్ త్రయం అనుకోకుండా ఈ ఏడాదిని మిస్సయ్యింది. కరోనా లేకపోయి ఉంటే మాత్రం ముగ్గురు మూడు డిఫరెంట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేవారు.
అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ అగ్ర హీరోలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పండగ సమయాల్లో వీరి సినిమాలు విడుదలైతే ఆ హవా మామూలుగా ఉండదు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా ముగ్గురు హీరోలు ఈ ఏడాదిని మిస్ చేసుకోవాల్సి వచ్చింది. అంతే కాకుండా 2021లో కూడా తొందరగా వస్తారనే గ్యారెంటీ లేదు. షారుక్ ఖాన్ అయితే ఇంకా సినిమాను కూడా మొదలు పెట్టలేదు. 2020నే కాకుండా కింగ్ ఖాన్ 2019ని కూడా మిస్ అయ్యాడు.

వరుస అపజయాలతో షారుక్ ఖాన్ కు కొంత గ్యాప్ వచ్చింది. ఇక మరో హీరో సల్మాన్ ఖాన్ 2019 చివరలో దబాంగ్ 3తో బాక్సాఫీస్ హిట్ అందుకోగా ఈ ఏడాది సమ్మర్ లో లేదా ఈద్ కు ప్రేక్షకుల ముందుకు రాధే సినిమాతో రావాలని అనుకున్నాడు. ఇక అమీర్ ఖాన్ అయితే లాల్ సింగ్ చద్దా సినిమాతో భారీ హిట్ అందుకోవాలని అనుకున్నాడు. ఇక ఆ సినిమా కూడా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది. ఇక 2020ని మిస్సయిన ఈ ముగ్గురు నెక్స్ట్ ఇయర్ ఎంత తొందరగా వస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











