Top 10 Heros: బాలీవుడ్ టాప్ 10 హీరోలు వీళ్లే.. ఖాన్‌లే ముగ్గురు.. మిగతా స్థానాల్లో ఎవరున్నారంటే?
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి అందిరకీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ తారలపై, సినిమాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా డిసెంబర్ 2023 మార్చి నెలకు సంబంధించి బాలీవుడ్ టాప్ 10 హీరోల లిస్టును విడుదల చేసింది. అందులో ఎవరెవరు ఉన్నారనే పూర్తి జాబితానే ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ టాప్ 10 హీరోల్లో మొత్తం ముగ్గురు ఖాన్ లు ఉన్నారు. వారెవరు, ఏయే స్థానాల్లో ఉన్నారనే దానితో పాటు మిగతా స్థానాల్లో ఎవరెవరున్నారే దాని గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం.
ఆర్మాక్స్ మీడియా సంస్థ రిలీజ్ చేసిన మార్చి 2024 టాప్ 10 హీరోల్లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ టాప్ 1 లో ఉన్నాడు. గతేడాది జవాన్, పఠాన్, డంకీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెక్ అయిన ఈయన ఆ ఏడాది మొత్తం.. ప్రతీ నెలా చేసే ఈ సర్వేలో మొదటి స్థానమే దక్కించుకుంటూ వస్తున్నాడు. ఇక టాప్ 2లో హృతిక్ రోషన్ నిలిచారు. ఈ ఏడాది మొదట్లో అంటే జనవరి 25వ తేదీన ఈయన హీరోగా చేసిన ఫైటర్ సినిమా రాగా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలా మళ్లీ ట్రెండ్ లోకి వచ్చిన ఈయన టాప్ 2లో నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

ఇక టాప్ 3లో అక్షయ్ కుమార్ నిలిచారు. చివరగా ఆయన రామ్ సేతు, 2.0 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే టాప్ 4లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఈయన గతేడాది టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు చేయలేకపోయాడు. ఇక టాప్ 5లో రణ్ బీర్ కపూర్ నిలిచారు. ఇటీవలే యానిమల్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడీ యంగ్ హీరో.
అలాగే టాప్ 6లో షాహిద్ కపూర్ నిలిచాడు. ఇటీవలే తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా సినిమాతో వచ్చి సూపర్ సక్సెక్ సాధించిన ఈయన ఇలా టాప్ లో నిలిచారు. ఇకా ఏడో స్థానంలో అంటే టాప్ 7లో సిద్దార్థ్ మల్హోత్ర నిలిచాడు. మార్చి 15వ తేదీన యోధ సినిమాతో వచ్చి అందరినీ నిరాశకు గురి చేసిన ఈయన 7వ స్థానానికి అంకితం అయ్యారు. ఇక టాప్ 8లో రణ్ వీర్ సింగ్ నిలిచారు. గతేడాది రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని సినిమాతో వచ్చి ప్రేక్షకులను అలరించారు.

అలాగే టాప్ 9లో అజయ్ దేవగన్ నిలిచారు. గతేడాది బోళా సినిమాతో వచ్చిన ఈయన ఈ ఏడాది సింగం 3 సినిమాతో వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక టాప్ 10లో ఆమిర్ ఖాన్ నిలిచారు. ఇలా చివరి స్థానం అందించుకున్న మూడో ఖాన్ ఈయనే.


Click it and Unblock the Notifications











