Top 10 Heroines: బాలీవుడ్‌ను ఏలేస్తున్న టాప్ 10 హీరోయిన్లులు వీళ్లే.. వన్‌లో ఆలియా, టూలో దీపికా!

సినీ రంగంలో ఎప్పటికప్పుడు హీరోలు, హీరోయిన్ల స్థనాలు మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా వీరి విషయంలో ఎవరు టాప్ అనేది ఎప్పటికీ తెగని అంశమే. వారు చేసే సినిమాలు, వచ్చే అవకాశాలు.. అందులో వారు కనబర్చిన నటనను బట్టిఎప్పటికప్పుడు వీరి ర్యాంక్ లు మారుతాయి. అయితే సోషల్​ మీడియా వచ్చాక హీరోయిన్లలో ఎవరు ఏయే స్థానాల్లో ఉన్నారో చేసే సర్వేలు ఎక్కువ అయ్యాయి. అలా నెలకోసారి కచ్చితంగా జరిపే ఈ సర్వేలో అనేక మంది అభిమానులు పాల్గొంటూ తమకు నచ్చిన వారి టాప్ కు తీసుకెళ్తుంటారు. అయితే 2024 మార్చి నెలకు గానూ బాలీవుడ్​లో టాప్​ హీరోయిన్లు వీరే అంటూ ఓ లిస్ట్ విడుదల చేసింది.

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఈ సర్వేను చేపట్టింది. ఎప్పటికప్పడు సర్వేలు చేసే ఈ సంస్థ సరైన ఫలితాలను వెల్లడిస్తూ.. సినీ ప్రియుల నమ్మకాన్ని ఎక్కువగా అందుకుంది. అయితే తాజాగా 2024 మార్చి నెలకు సంబంధించి బాలీవుడ్​లో ఉన్న టాప్​ 10 హీరోయిన్​లు వీరే అంటూ ఓ లిస్టును రిలీజ్ చేసింది. ఈ జాబితాను ఆర్మాక్స్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. అయితే ఇందులో టాప్ స్థానాల్లో ఎవరెవరు ఉన్నారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2024 MarchTop 10 Heroines in India Alia Bhatt Deepika Padukone Katrina Kaif Kiara Advani Full Details Here

దేశం మెచ్చిన టాప్ 10 హిందీ హీరోయిన్లలో.. నెంబర్ వన్ స్థానంలో ఆలియా భట్ నిలిచింది. ఈ క్యూట్ బ్యూటీ చాలా కాలంగా టాప్ 1లోనే నిలుస్తూ సందడి చేస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈమె మంచి పేరు తెచ్చుకుంది. ఇక అప్పటి నుంచి ఈమె ట్రెండింగ్ లోనే నిలుస్తుంది. ఇక టాప్ 2లో దీపికా పదుకొణె నిలిచింది. ఇటీవల జవాన్ సినిమాలో అథితి పాత్రలో నటించిన ఈ భామ కుర్రకారు మదిలో స్థానం సంపాదించుకుంది.

ఇక మూడో స్థానంలో కత్రీనా కైఫ్ నిలిచింది. ఇటీవలే ఈ క్యూట్ బ్యూటీ టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆడట్లేదు. కానీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఇక టాప్ 4లో కృతి సనన్ నిలిచింది. గతేడాది ఆది పురుష్ సినిమాతో పాటు గణ్ పథ్ చిత్రంలో నటించిన ఈమెకు పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే టాప్ 5లో కియారా అడ్వాణీ స్థానం దక్కించుకుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా చేస్తున్న గమే ఛేంజర్ సినిమాతో పాటు.. సత్య ప్రేమ్ కీ కథ అనే హిందీ సినిమాలోనూ నటిస్తోంది.

2024 MarchTop 10 Heroines in India Alia Bhatt Deepika Padukone Katrina Kaif Kiara Advani Full Details Here

అలాగే 6వ స్థానంలో శ్రద్ధా కపూర్ నిలిచింది. టాప్ 7లో కరీనా కపూర్ నిలవగా.. 8వ స్థానంలో ప్రియాంక చోప్రా జోనస్ స్థానం దక్కించుకుంది. ఇక చివరి రెండు స్థానాలు అయినా టాప్ 9, టాప్ 10లలో అనుష్క శర్మ, దిశా పటానిలు నిలిచి సినీ ప్రియులను మదిని దోచేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X