నా తలకు పిస్టల్ గురిపెట్టి కాల్చి చంపేయ్.. రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్
ఇండియన్ సినిమా రంగంలో సినిమా మేకింగ్ విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన వారైవరైనా ఉన్నారంటే అది రాంగోపాల్ వర్మనే. శివ మూవీతో ట్రెండ్ సెంటర్‌గా మారి భారతీయ సినిమా రంగాన్ని, ప్రేక్షకుల దృష్టిని తనపైన మరల్చుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇండియన్ ఆడియెన్ దిమ్మతిరిగే సినిమాలతో చరిత్ర సృష్టించారు. అయితే తన కెరీర్‌లో అద్బుతంగా తీర్చి దిద్దిన సత్య సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఆ చిత్ర యూనిటీ రీ యూనియన్ జరిగింది. ఈ సందర్భంగా వర్మ చేసిన కామెంట్స్‌లోకి వెళితే..
సత్య మూవీ 25 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ముంబైలో చిత్ర యూనిట్ అంతా కలిశారు. ఈ సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాను ముంబైలో చూసిన తర్వాత వర్మ ఉద్వేగానికి గురయ్యాడు. కంటతడి పెట్టుకొని ఆనాటి మెమొరీస్‌ను గుర్తు చేసుకొన్నారు. ఈ సినిమా తర్వాత నా ముందుకు వచ్చిన అవకాశాలను చేజార్చుకోవడం గిల్టీగా ఉందని అన్నారు.

సత్య రీ రీలీజ్ సందర్బాన్ని పురస్కరించుకొని బికూ మాత్రే అలియాస్ మనోజ్ బాజ్‌పేయ్ ట్విట్టర్‌లో ఎమోషనల్ అయ్యాడు. నీలాంటి జీవితాన్ని కొనసాగించాలంటే.. నీ మాదిరిగా వర్క్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. భయం లేకుండా నీవు పనిచేసే తీరు మాటల్లో చెప్పలేం. అందుకే ప్రతీ ఒక్కరి రాం గోపాల్ వర్మ కాలేరు. మీరు మీకే సాటి. మీ టాలెంట్ ఎవరికీ లేదు. వైవిధ్యంతో కూడిన అరుదైన జీవివి మీరు. మీతో ట్రావెల్ అయ్యే అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ అంటూ మనోజ్ బాజ్‌పేయ్ ట్వీట్ చేశారు.
మనోజ్ బాజ్‌పేయ్ ట్వీట్‌కు ఆర్జీవి స్పందిస్తూ.. ఆయన కూడా ఎమోషనల్ అయ్యాడు. వెల్ బీకూ భబాయ్.. థ్యాంక్స్. నేను నీకు ఇప్పటికే ప్రామిస్ చేసినట్టు.. మీరు బ్రాండ్ న్యూ వర్మను చూస్తారు. అలా నేను చేయకపోతే.. నేను ఫెయిల్ అయితే.. నా తలలో పిస్టల్ గురిపెట్టి షూట్ చేసి చంపేయ్ అంటూ ట్వీట్ చేశారు. ఈ కామెంట్‌పై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. మీలో మార్పు మంచిదే. చివరకు మంచి నిర్ణయం తీసుకొన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

సత్య మూవీ విషయానికి వస్తే.. ముంబైను గడగడ వణికించిన అండర్ వరల్డ్ నేపథ్యంగా ఈ సినిమాను వర్మ తెరకెక్కించారు. ఈ సినిమాలో ఊర్మిల మతోంద్కర్, మనోజ్ బాజ్‌పేయ్, జేడీ చక్రవర్తి తదితరులు నటించారు. ఈ సినిమా 1998 సంవత్సరం జూలై 3వ తేదీన రిలీజైంది.


Click it and Unblock the Notifications











