కంగన రనౌత్ మూవీపై 250 కోట్ల దావా.. వివాదంలో బాలీవుడ్ క్వీన్ సీక్వెల్!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ యాక్టర్ కంగన రనౌత్ మరోసారి వివాదంలో చిక్కుకొన్నది. ఇటీవల ప్రారంభమైన క్వీన్ సీక్వెల్ క్వీన్ 2 చిత్రం లీగల్ వ్యవహారాల్లో చిక్కుకొన్నది. ఈ సినిమా హక్కుల విషయంలో అగ్రిమెంట్‌ను తుంగలో తొక్కారని ఆరోపిస్తూ ప్రముఖ సంస్థ జియో స్టార్‌పై ముంబైకి చెందిన ఫాంథమ్ స్టూడియోస్ కోర్టులో భారీ మొత్తంలో దావా పిటిషన్ దాఖలు చేస్తూ ముంబై కోర్టును ఆశ్రయించడం సంచలనం రేపింది. ఈ వివాదానికి సంబంధించిన కారణం ఏమిటి? ఎంత మొత్తం చెల్లించాలంటూ పాంథమ్ స్టూడియో దావా వేసింది అనే వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ కెరీర్‌లో అతిపెద్ద విజయం సాధించిన క్వీన్ చిత్రం 2013 సంవత్సరంలో రూపొందింది. ఈ సినిమాకు వికాస్ బెహల్ దర్శకత్వం వహించారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా క్వీన్ 2 రూపొందించాలని కంగన రనౌత్‌తో వికాస్ బెహల్ జతకట్టారు. ఈ మేరకు షూటింగ్ ప్రారంభించి గతవారం ఓ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటున్న సమయంలో ఫాంథమ్ స్టూడియో ముంబై కోర్టులో 250 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ వేశారు.

250 Crores Law suit filed on Kangana Ranaut s Queen 2

క్వీన్ సినిమాకు సంబంధించిన వివాదం వెనుక అసలు కథ ఏమిటంటే?.. క్వీన్ సినిమా రైట్స్‌లో పాంథమ్ స్టూడియోస్‌కు 50 శాతం వాటా ఉంది. అయితే ఆ సినిమాకు సీక్వెల్‌గా గానీ, ఆ కథను ఆధారంగా చేసుకొని గానీ సినిమా తీస్తే తమకు కూడా సమాన భాగంలో హక్కులు, వాటా ఉంటటాయి. అయితే క్వీన్ 2 సినిమా ప్రారంభించినప్పుడు తమకు ఎలాంటి సమాచారం గానీ, వివరాలు గానీ వెల్లడంచలేదు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొన్నది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి అని తమ పిటిషన్‌లో పాంథమ్ స్టూడియోస్ తెలిపింది.

అయితే క్వీన్ 2 సినిమా నిర్మాణం గురించిన తెలిసినప్పటి నుంచి పలుమార్లు జియో స్టార్‌ను సంప్రదించాం. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. వారితో చర్చలు జరుపాలని చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. మా అభ్యర్థనలను జియోస్టార్ తోసిపుచ్చింది. మేము సానుకూలంగా పరిష్కరించుకోవాలని చేసిన వ్యవహారం కొలిక్కి రాలేదు. అందుకే కోర్టును ఆశ్రయించి.. మా హక్కులకు ప్రతిఫలం పొందాలని పిటిషన్ వేశాం అని పాంథమ్ స్టూడియోస్ తెలిపారు.

క్వీన్ సినిమా విషయానికి వస్తే.. కంగన రనౌత్, రాజ్ కుమార్ రావు, లిసా హేడెన్ నటించిన ఈ చిత్రానికి వికాస్ బెహల్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాను పాంథమ్ స్టూడియోస్ బ్యానర్‌పై అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానీ నిర్మించారు. ఈ సినిమాను 20 కోట్ల రూపాయలతో నిర్మించగా.. ఈ చిత్రం 95 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొన్నది.

Read more about: kangana ranaut queen
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X