252 కోట్ల డ్రగ్స్ కుంభకోణం.. దావూద్ ఇబ్రహీం రేవ్ పార్టీకి ప్రభాస్ హీరోయిన్?
బాలీవుడ్‌లో మరోసారి భారీ డ్రగ్స్ కుంభకోణం వెలుగుచూస్తున్నది. అండర్ వరల్డ్ మాఫియాతో స్టార్ హీరోయిన్లకు, హీరోలకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రావడం దిగ్బ్రాంతికరంగా మారాయి. అయితే డ్రగ్స్ కుంభకోణంలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పేరు తెరపైకి రావడం ఇండస్ట్రీని షాక్ గురి చేస్తున్నది. పలువురు హీరోయిన్లు మాఫియా గ్యాంగ్ నిర్వహించిన రేవ్ పార్టీల్లో పాల్గొన్నట్టు వార్తలు రావడం మరింత వివాదంగా మారింది. అయితే పలువురు సెలబ్రిటీలపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణకు సిద్దమవుతున్నట్టు తెలిసింది. ఈ డ్రగ్స్ దందాలో వినిపిస్తున్న సెలబ్రిటీలు ఎవరు? ఎన్ని కోట్ల మేర దందా జరిగింది? అనే వివరాల్లోకి వెళితే..
ఇండియా టుడే, పీటీఐ వెల్లడించిన వార్త కథనాల ప్రకారం.. దావూద్ ఇబ్రహిం ముఠాకు చెందిన సలీమ్ డోలా నేతృత్వంలో డ్రగ్స్ దందా సాగుతున్నది. దుబాయ్ కేంద్రంగా ఈ వ్యవహారాలు కొనసాగుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలకు, ఇతర దేశాలకు మెఫెడ్రోన్ (mephedrone (M-Cat or Meow Meow)) అనే మాదక ద్రవ్యాలను సరఫరా చేసినట్టు తెలిసింది. ఇటీవల దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసిన తాహెర్ అనే నిందితుడు వెల్లడించిన సమాచారంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.

దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్న వారిలో ర్యాపర్ లోక, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్, నోరా ఫతేహి, సిద్దాంత్ కపూర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఓరీ, ప్రముఖ దర్శక ద్వయం అబ్బాస్ మస్తాన్, ముంబైలో మాఫియా కాల్పుల్లో మరణించిన సల్మాన్ ఖాన్ స్నేహతుడు బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్దిఖీ లాంటి పేర్లు తెరపైకి వచ్చాయి.
పీటీఐ కథనం ప్రకారం.. దావూద్ ఇబ్రహీం అనుచరులు నిర్వహిస్తున్న డ్రగ్స్ దందా సుమారుగా 252 కోట్ల రూపాయలు అని తేలింది. ముంబై పోలీసులు తెలిపిన ప్రకారం.. సలీమ్ షేక్ అనే వ్యక్తి ముంబై, విదేశాల్లో ప్రముఖులు, బిజినెస్ సెలబ్రిటీలు, సినీ తారలతో కలిపి పార్టీలు నిర్వహించారు. ఆ పార్టీల్లో నోరా ఫతేహి, శ్రద్దాకపూర్, ఓరీ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ దందాలో పెద్ద ఎత్తున్న డ్రగ్ ట్రాఫికింగ్, హవాలా, మనీలాండరింగ్ జరిగింది.
రేవ్ పార్టీలు, డ్రగ్స్ సరఫరా లాంటి అంశాలను తీవ్రంగా పరిగణిస్తున్న ఎన్సీబీ ముంబై అధికారులు త్వరలోనే సెలబ్రిటీలకు సమన్లు జారీ చేసేందుకు సిద్దమవుతున్నారు. రాజకీయ నేతలు, సినీ తారలు, హై ప్రొఫైల్ బిజినెస్ వర్గాలకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ స్కామ్‌లో ఎవరెవరికీ సంబంధాలు ఉన్నాయి? ఎక్కెడెక్కడ పార్టీలు జరిగాయి అనే విషయాలపై అధికారులు దృష్టిపెట్టారు. అధికారులు, మీడియా కథనాలతో ఇండస్ట్రీ వర్గాలు దిగ్బ్రాంతికి గురి అవుతున్నారు.
జాతీయ మీడియాలో వస్తున్న కథనాలపై నోరా ఫతేహి స్పందించారు. డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీల్లో పాల్గొన్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. అండర్ వరల్డ్, దావూద్ ఇబ్రహీం ముఠాతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. క్లిక్ కోసం వార్తలు రాస్తూ నా పేరును ఈ స్కామ్‌లో జోడించకండి అని నోరా ఫతేహి ఓ ప్రకటనను విడుదల చేసింది. మీడియా వార్తలతో తీవ్రంగా కలత చెందానని ఆమె పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











