For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమితాబ్‌ను వెనక్కి నెట్టిన ప్రధాని మోదీ... 13వ స్థానంలో దీపిక పదుకోన్!

|

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లను వెనక్కి నెట్టి 6వ స్థానం దక్కించుకున్నారు. ప్రపంచంలో ఎక్కువగా అభిమానించబడుతున్న వ్యక్తులు ఎవరు అనే అంశంపై 2019 సంవత్సరానికి గాను నిర్వహించిన ఓ సర్వేలో మోదీ ఈ ఘనత సాధించారు.

యుగోవ్ అనే ఇంటర్నేషనల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ 'వరల్డ్ మోస్ట్ అడ్మైర్డ్ 2019 లిస్ట్' పేరుతో ఓ జాబితా విడుదల చేసింది. ఇందులో బిగ్ బి అమితాబ్ 12వ స్థానంలో నిలిచారు. గతేడాదితో పోలిస్తే ఆయన 3 స్థానాలు దిగజారిపోయారు. షారుక్ ఖాన్ 16వ స్థానంలో, సల్మాన్ ఖాన్ 18వ స్థానంలో నిలిచారు.

ఈ సారి షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఈ జాబితాలో కొత్తగా చోటు దక్కించుకున్నారు. 20 మందితో కూడిన లిస్టులో బాలీవుడ్ నుంచి ముగ్గురు స్టార్లకు స్థానం లభించింది. మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ నెం.1 స్థానంలో ఉన్నారు. తర్వాత స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జాకీ చాన్ ఉన్నారు.

ప్రపంచ కప్ వివాదం.. ఐసీసీ తీరుపై మెగాస్టార్ కామెంట్స్

3 Bollywood biggies in Worlds Most Admired 2019 list

మహిళల విభాగంలో దీపిక పదుకోన్ 13వ స్థానంలో ఉన్నారు. ప్రియాంక చోప్రా 14 స్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానంలో ఐశ్వర్యరాయ్, సుష్మితా సేన్ 16, 17 పొజిషన్ దక్కించుకున్నారు. మోస్ట్ అడ్మైర్డ్ ఉమెన్ 2019పేరుతో విడుదలైన ఈ జాబితాలో మిచెల్లీ ఒబామా నెం.1 స్థానంలో ఉన్నారు. గతేడాది టాప్ పొజిషన్లో హాలీవుడ్ నటి ఏంజెలీ ఉండగా... ఇపుడు ఆమె 3వ స్థానానికి పడిపోయారు.

ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన హయ్యెస్ట్ పేయిడ్ సెలబ్రిటీ లిస్టులో బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్‌కు మాత్రమే చోటు దక్కింది. అయితే అతడికి వరల్డ్ మోస్ట్ అడ్మైర్డ్ 2019లో మాత్రం స్థానం లభించలేదు. 65 మిలియన్ డాలర్ల సంపాదనతో అక్షయ్ కుమార్ ఫోర్బ్స్ జాబితాలో 33వ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

English summary
Prime Minister Narendra Modi earn the sixth spot in World's Most Admired 2019 list. Big B is on the 12th position and Shah Rukh is on 16th, followed by Salman, who ranks at 18th position in the men's category.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more