సల్మాన్, షారుఖ్ ఫైట్ కోసం ఊహించని బడ్జెట్.. ఆ ఖర్చుతో మీడియం రేంజ్ సినిమా తియొచ్చు..

గత కొంతకాలంగా బాలీవుడ్ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. ఒక్క సినిమా కూడా హిట్టు కావట్లేదు. ఇలాంటి సమయంలోనే షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ఆశలు చిగురించేలా చేశాడు. ఆ సినిమా హిట్టుగా నిలిచినా ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ ఫట్టుమన్నాయి ఇటీవల విడుదలైన సల్మాన్ సినిమా కిసీ కా భాయి కిసీ కా జాన్ కూడా ఫ్లాప్ గా నిలవడంతో.. ఆశలన్నీ టైగర్-3 చిత్రంపైనే ఉన్నాయి.

సల్మాన్ ఖాన్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం టైగర్-3. అయితే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ల మధ్య ఓ అదిరిపోయే యాక్షన్ సీన్ పెడుతున్నారు. అయితే ఈ అదిరిపోయే సీన్ కోసం ఏకంగా రూ.35 కోట్లు ఖర్చు చేయబోతున్నారట. దీంతో విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఖర్చుతో మీడియం రేంజ్ హీరో సినిమా తీయవచ్చు అని అంటున్నారు.

Salman Khan and Shah Rukh Khan

జైల్ లో కొనసాగే సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్ ను రూపొందిస్తున్నారట. సల్మాన్, షారుఖ్ ఇద్దరూ ఈ సినిమాలో భాగం అవుతారట. మే 8వ తేదీ నుంచి ఈ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారని బాలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం. వీరిద్దరూ ఒకే సినిమాలో నటిస్తున్నారంటే విపరీతమైన బజ్ ఏర్పడుతుందని... వారి స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకొని అదిరిపోయే సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న టైగర్-3లో కత్రినా కైఫ్.. జోయా పాత్రలో నటించింది. అయితే ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే ఇతను ఓ ఐఎస్ఐ ఏజెంట్ పాత్రలో దర్శనం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆదిత్యా చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Salman Khan and Shah Rukh Khan

టైగర్ 3 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది దీపావళికి అంటే నవంబర్ 10వ తేదీన రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరుసగా పరాజయాలు అందుకుంటున్న సల్మాన్ ఖాన్ ఈ సినిమాతోనైనా హిట్టు కొడతారో లేదో చూడాలి మరి. ఈ ఏడాది షారుఖ్ నటించిన పఠాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసి ఫ్యాన్స్ ను అలరించాడు. మరోసారి టైగర్ కోసం పఠాన్ అతిధి పాత్రలో మెరవడనుండటంతో సినిమాపై బజ్ ఏర్పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X