లిప్ లాక్ కోసం 47 టేకులు .. 3 రోజులు షూటింగ్ , ఆ హీరోయిన్ తల్లి ముందే రెచ్చిపోయిన హీరో

రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని సినిమా హాల్‌లో కూర్చోబెట్టడం అంత ఈజీ కాదు. షూటింగ్‌లో ఏదైనా సీన్ కోసం నటీనటులు, దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడతారు. ఎర్రటి ఎండల్లో, గడ్డ కట్టే మంచులో షూటింగ్‌లో పాల్గొనాల్సిందే. ఇక ఏదైనా డిఫరెంట్ స్టైల్‌లో మేకప్ కోసం గంటలకు గంటలు సహనంతో ఉండాల్సిందే. ఇంకొన్నిసార్లు కంపు కొట్టే ఏరియాలలో తిరిగాల్సిందే. ఇంత కష్టపడినా కొన్నిసార్లు సీన్ కరెక్ట్‌గా రావడానికి టేకులు మీద టేకులు తీసుకోవాల్సి వస్తుంది. అది ఓ ముద్దు సీన్ అయితే .. ఓ బాలీవుడ్ సినిమాలో లాంగ్ కిస్ సీన్ కోసం హీరో హీరోయిన్లు ఏకంగా 3 రోజులు కష్టపడాల్సి వచ్చిందట. ఈ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ధర్మేష్ దర్శన్ గుర్తున్నారా. లూటేరాతో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన రాజా హిందూస్థానీ, మేలా, ధడ్కన్, హాన్ మేన్ భీ ప్యార్ కియా, బేవాఫా, ఆప్ కి ఖటిర్ వంటి సినిమాలతో అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. మూడు దశాబ్ధాల కెరీర్‌లో కేవలం 7 సినిమాలు మాత్రమే తీసిన దర్శన్ తను అనుకున్న సీన్ వచ్చే వరకు కష్టపడతారని పేరుంది. ఈ క్రమంలోనే రాజా హిందూస్తానీ సినిమా సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

47 retakes 3 Day shoot for Karisma Kapoor s kissing scene with Aamir Khan in Raja Hindustani

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కరీష్మా కపూర్‌లు రాజా హిందూస్థానీలో జంటగా నటించారు. సురేష్ ఒబెరాయ్, అర్చనా పూరన్ సింగ్, జానీ లీవర్, ఫరీదా జలాల్, టికూ తలసానియాలు కీలకపాత్రలు పోషించారు. 1965లో శశికపూర్- నందాలు నటించిన జబ్ జబ్ పూల్ ఖిలే సినిమా ఆధారంగా రాజా హిందూస్థానీని తెరకెక్కించారు. నదీమ్ - శర్వాణ్‌లు స్వరాలు సమకూర్చగా సినీయుగ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు.

కరిష్మా కపూర్ పోషించిన పాత్రకు తొలుత జూహీ చావ్లాను సంప్రదించగా ఆమె తిరస్కరించారు. తర్వాత పూజా భట్, ఐశ్వర్యరాయ్‌‌లకు కూడా కథ వినిపించగా నో చెప్పారు. చివరికి కరిష్మా కపూర్ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.5.75 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన రాజా హిందుస్థానీ 17 నవంబర్ 1996న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 76.34 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బాలీవుడ్‌ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. 90వ దశకంలో బాలీవుడ్‌లో హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన నాలుగు సినిమాల్లో ఒకటిగా రాజా హిందుస్థానీ నిలిచింది.

47 retakes 3 Day shoot for Karisma Kapoor s kissing scene with Aamir Khan in Raja Hindustani

ఈ ఏడాదితో ఈ మూవీ రిలీజై 28 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా చిత్ర దర్శకుడు ధర్మేష్ దర్శన్ ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. రాజా హిందుస్తానీలో ఓ ముద్దు సీన్‌ని చిత్రీకరించాల్సి వచ్చిందని.. ఈ విషయాన్ని ముందుగానే కరిష్మాకు చెప్పామని, ఆమెకు అదే తొలి ఫస్ట్ లిప్ లాక్ కావడంతో కంగారు పడిందని దర్శన్ తెలిపారు. దీంతో కరిష్మ తల్లిని సెట్‌కి పిలిపించామని.. కానీ సీన్ సరిగా రాకపోవడంతో ఏకంగా 47 టేకులు తీసుకుని, 3 రోజుల పాటు షూటింగ్ చేశామని ధర్మేష్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X