కరణ్ జోహార్ పార్టీలో పగిలిన కరోనా పుట్ట.. హాజరైన 55 మందికి కరోనా.. సౌత్ స్టార్స్ కూడా?

బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తన 50వ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ పార్టీ చేసుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకకు సౌత్ సహా బాలీవుడ్ కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్లో జరుగుతున్న ప్రచారం మేరకు, ఈ పార్టీలో పాల్గొన్న చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అయితే ఈ విషయాన్ని కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతున్నారని తెలుస్తోంది. వార్తలు ఎక్కడా బయటకు రానీయకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

యష్ రాజ్ స్టూడియోలో

యష్ రాజ్ స్టూడియోలో

కరణ్ జోహార్ తన 50వ పుట్టినరోజును మే 25న జరుపుకున్నాడు. ఈ సందర్భంగా కరణ్ జోహార్ ముంబైలోని యష్ రాజ్ స్టూడియోలో కరణ్ జోహార్ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా బాలీవుడ్ స్టార్స్ అందరూ ఈ పార్టీలో కనిపించారు.నిపుణులు దీనిని 'బాలీవుడ్ రీయూనియన్' అని పిలిచారు.

55 మంది

55 మంది

ఒక బాలీవుడ్ నుంచి కాక సౌత్ నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు ఈ గ్రాండ్ బర్త్ డే పార్టీకి హాజరయ్యారు. బాలీవుడ్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం, ఈ పార్టీకి హాజరైన దాదాపు 55 మంది అతిథులు కోవిడ్ బారిన పడ్డారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై కరణ్ జోహార్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అధికారిక ప్రకటన కోసం

అధికారిక ప్రకటన కోసం

బాలీవుడ్ న్యూస్ పోర్టల్ బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం, కరణ్ జోహార్ ఇచ్చిన ఈ పార్టీ కరోనా యొక్క సూపర్ స్ప్రెడర్ అని నిరూపించబడిందని అంటున్నారు. ఇప్పటివరకు పార్టీకి హాజరైన 50 నుంచి 55 మంది అతిథులు కోవిడ్ పాజిటివ్‌గా పరీక్షించబడ్డారు. కరణ్ జోహార్ కు అత్యంత సన్నిహితులు కోవిడ్ పాజిటివ్‌గా మారారని తెలుస్తోంది. అయితే, తమకు కరోనా పాజిటివ్ అని చాలా మంది బయటకు చెప్పడం లేదు. కరణ్ జోహార్ అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఇంకా ఎదురుచూస్తున్నారు.

ముంబై టెన్షన్

ముంబై టెన్షన్


నిజానికి ప్రస్తుతం కోవిడ్ ప్రభావం బాగా తగ్గింది. కోవిడ్ గురించి చర్చ కూడా జరగడం లేదు. ప్రజల్లో కూడా కోవిడ్ గురించి భయాందోళనలు పూర్తిగా తొలగిపోయాయి. అయితే గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు స్వల్పంగా పెరిగినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. కరణ్ జోహార్ పార్టీ జరిగిన ముంబై కూడా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ క్రమంలోనే 55 మంది గెస్ట్స్ లో వైరస్ కి ఇన్ఫెక్ట్ అయ్యారనే వార్త సంచనలంగా మారింది.

సౌత్ స్టార్స్ కూడా

సౌత్ స్టార్స్ కూడా


కరణ్ తో కలిసి 'లైగర్' సినిమా చేస్తున్న హీరో విజయ్ దేవరకొండ - డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - నిర్మాత చార్మీ కౌర్ ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. అలాగే దక్షిణాది చిత్రాల్లో నటిస్తోన్న తమన్నా భాటియా - పూజా హెగ్డే - రష్మిక మందన్నా - రకుల్ ప్రీత్ సింగ్ లు కూడా హాజరయ్యారు. పార్టీలో హాజరైన 55 మంది కరోనా సోకిందనే విషయం తెలియడంతో ఇప్పుడు పార్టీకి హాజరైన అందరిలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. అది ఈ విషయమై అధికారిక ప్రకటన వస్తే కానీ నిజమని నిర్ధారించలేని పరిస్థితి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X