Aryan Khan arrest లో బిగ్ ట్విస్ట్.. బిజినెస్ టైకూన్ కూతురు కూడా.. అర్ధరాత్రి షారుక్ ఇంటికి సల్మాన్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఆదివారం ఉదయం డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. క్రూయిజ్ షిప్‌లో జరిగిన పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విభాగపు అధికారులు మెరుపు దాడి చేసి ఆర్యన్ ఖాన్‌తోపాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేయడం బాలీవుడ్ వర్గాలను షాక్ గురి చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత జరుగుతున్న డ్రగ్స్ కేసు దర్యాప్తులో ఓ అగ్ర హీరోకు సంబంధించిన అరెస్ట్ కావడం ఇదే మొదటిసారి. ఇలాంటి పరిస్థితుల్లో షారుక్ ఖాన్‌ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. అర్యన్ ఖాన్ అరెస్ట్ వివరాల్లోకి వెళితే...

ఆర్యన్ ఖాన్‌తోపాటు ఏడుగురు
గోవాకు చెందిన క్రూయిజ్ లైనర్‌లో శనివారం రాత్రి రేవ్ పార్టీ జరుగుతున్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ విభాగం అధికారులకు సమాచారం అందింది. ఆ పార్టీపై దాడి చేయగా ఆర్యన్ ఖాన్‌తోపాటు మరో ఏడుగురు పార్టీలో ఉన్నారు. అరెస్ట్ చేసిన వారిలో ఆర్యన్ ఖాన్ స్నేహితుడు, నటుడు అర్బాజ్ మర్చంట్; మున్‌మున్ దమేచా, నుపూర్ సతీజా, ఇష్మీత్ చద్దా, మోహన్ జైస్వాల్, గోమిత్ చోప్రాం, విక్రాంత్ చోకర్ ఉన్నారు. మున్ మున్ మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె అని తెలిసింది.

ముంబై టూ గోవా క్రూయిజ్‌లో
ముంబై నుంచి గోవాకు వెళ్తున్న కార్డేలియా క్రూయిజ్‌లో సుమారు 1000 మంది ప్యాసింజర్లు ఉన్నారు. వారిలో 200 మంది క్రూయిజ్ నుంచి వెనుకకు వచ్చారు. వారి గురించి ఆధారాలు సేకరిస్తున్నాం. దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ దాడిలో నిందితుల నుంచి 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరస్, 22 ఎండీఎంఏ పిల్స్, 5 గ్రాముల మెఫెడ్రోన్, 1.3 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకొన్నాం అని ఎన్సీబీ అధికారులు చెప్పారు.

జేజే హాస్పిటల్‌లో ఆర్యన్‌కు పరీక్షలు
ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌ను మీడియా వెల్లడించిన తర్వాత వారిని జేజే హాస్పిటల్‌కు తీసుకెళ్లి 4 గంటల ప్రాంతంలో పరీక్షలు నిర్వహించారు. వారిని హాస్పిటల్ నుంచి 40 నిమిషాల తర్వాత వెనుకకు 7 గంటల ప్రాంతంలో తీసుకొచ్చి హాలీడే కోర్టులో హాజరుపరిచారు. ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదు. కానీ మర్చంట్ షూస్‌లో కొద్దిపాటి చరస్ లభించింది. వీరిద్దరి క్రూయిజ్ లైనర్‌లో ఓ రూమ్‌లో ఉన్నారు అని ఎన్సీబీ తెలిపింది.

ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వండి.. సతీష్ మాన్‌షిండే
అర్యన్ ఖాన్‌ను విడుదల చేయాలని లాయర్ సతీష్ మాన్‌షిండ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్యన్ వద్ద టికెట్ లేదు, వారికి ఎలాంటి క్యాబిన్ కేటాయించలేదు. పార్టీకి ఆహ్వానించడం వల్లే ఆర్యన్ అక్కడికి వెళ్లాడు. అతడికి బోర్డింగ్ పాస్ కూడా లేదు. వాట్సప్ చాటింగ్‌ను ఆధారంగా చేసుకొని అరెస్ట్ చేశారు అని సతీష్ మాన్‌షిండే తెలిపారు. గతంలో డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి తరుఫున సతీష్ మాన్‌షిండే వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే.
Recommended Video

పఠాన్ షూటింగ్ నుంచి హుటాహుటిన ముంబైకి
ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వార్త బయటకు వచ్చిన సమయంలో షారుక్ ఖాన్ స్వీడన్‌లో పఠాన్ సినిమా షూటింగులో ఉన్నారు. తన కుమారుడు అరెస్ట్ వార్త వినగానే హుటాహుటిన ముంబైకి చేరుకొన్నారు. తన కొడుకుకు సంబంధించిన బెయిల్ పిటిషన్లు, విడుదల గురించి పలువురితో చర్చించారు. ఇలాంటి పరిస్థితుల్లో షారుక్ ఖాన్‌ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. షారుక్ ఖాన్ అధికారిక నివాసం మన్నత్‌కు సల్మాన్ ఖాన్ వెళ్లి ఓదార్చారు. మన్నత్ భవనం ముందు సల్మాన్ ఖాన్ వాహనం వెళ్తూ మీడియా కంట పడ్డాయి.


Click it and Unblock the Notifications











