దీపిక-రణబీర్ కలిసి ఆమెపై దాడి చేశారా? వీడియో సాక్ష్యంతో....

By Bojja Kumar

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ ఇటీవల అమెరికాకు వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. వారు ఫ్లోరిడాలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండగా గమనించిన కొందరు అభిమానులు వారిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే ఈ వీడియో తీసేందుకు ప్రయత్నించింది తానే అని, తమతో ఒక్క ఫోటో దిగాలని అడిగినందుకు తనపై దాడి చేశారని జైనబ్ ఖాన్ అనే లేడీ ఫ్యాన్ ఆరోపించారు. జైనబ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ఇపుడు వైరల్ అయింది.

 రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు, అభిమానిని కోల్పోయారు

రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు, అభిమానిని కోల్పోయారు

దీపిక, రణవీర్‌లకు అభిమానులకు రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు, వారి దురుసు ప్రవర్తనతో వారి సెల్ఫ్ రెస్పెక్టుతో పాటు ఒక అభిమానిని కోల్పోయారు అంటూ.... జైనబ్ ఖాన్ పెట్టిన పోస్టు ఇపుడు వైరల్ అయింది.

దాడి చేయడానికి వచ్చిందంటూ..

దీపిక తనపై దాడి చేయడానికి వచ్చింది అంటూ... జైనబ్ ఖాన్ ఓ వీడియో సైతం పోస్టు చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇపుడు వైరల్ అయింది.

పూర్తి వీడియో లేదా?

పూర్తి వీడియో లేదా?

నీపై దాడి జరిగిందని అంటున్నావు... పూర్తి వీడియో లేదా? అని ఓ ఇన్‌స్టా‌గ్రామ్ యూజర్ ప్రశ్నించగా.... దానికి జైనబ్ స్పందిస్తూ ‘ఆ వీడియోలో వారి ఫేస్ చూడండి, ఎంత కోపంగా ఉన్నారో? వారు నన్ను వేధించడంతో వీడియో కంటిన్యూ చేయలేక పోయాను' అని జైనబ్ తెలిపారు.

నన్ను దారుణంగా అవమానించారు

నన్ను దారుణంగా అవమానించారు

నేను వీడియో తీస్తుండగా నా వైపు చూసిన దీపిక.... నవ్వుతూ వచ్చారు. నాతో ఫోటో దిగడానికి వస్తుందన్నారేమో అనుకున్నాను. కానీ వారు నాపై అరుస్తూ, తిడుస్తూ దాడి చేశారు. అందరి ముందు నన్ను అవమాన పరిచారు అని జైనబ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

 అభిమానిస్తే ఇలా చేస్తారా?

అభిమానిస్తే ఇలా చేస్తారా?

అయినా మేము ఏం తప్పు చేశాం? అభిమానంతో మాతో ఒక ఫోటో దిగుతారా? అని అడగటమే మేము చేసినా తప్పా? అభిమానుల పట్ల మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అంటూ జైనబ్ ఖాన్ ఫైర్ అయ్యారు.

ముంబై చేరుకున్న దీపిక-రణవీర్

ముంబై చేరుకున్న దీపిక-రణవీర్

ఈ గొడవ తర్వాత దీపిక, రణబీర్ శుక్రవారం ఉదయమే ముంబై చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఒకరి చేయి ఒకరు పట్టుకుని వెళ్లడంతో త్వరలో వీరి వివాహం ఖాయం అనే వార్తలకు మరింత బలం చేకూరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X