twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘‘ఇండస్ట్రీ పెద్దలు కొందరు నా సినిమాపై కుట్ర చేస్తున్నారు’’

    |

    బాలీవుడ్ సినీయర్ స్టార్ గోవిందా త్వరలో 'రంగీలా రాజా' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే విడుదల ముందే ఈ సినిమా అనేక కష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు నా సినిమాపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

    త్వరలో విడుదల కాబోతున్న 'రంగీలా రాజా' చిత్రంలోని 20 సీన్లను తొలగించాలని కేంద్ర సెన్సార్ బోర్డ్ తేల్చి చెప్పింది. ఆ సీన్లను తొలగించక పోతే సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పడంతో గోవిందా ఆగ్రహంగా ఉన్నారు.

    నా సినిమాలపై కుట్ర జరుగుతోంది

    నా సినిమాలపై కుట్ర జరుగుతోంది

    గత 9 సంవత్సరాలుగా నాపై, నా సినిమాలపై ఇండస్ట్రీలోని కొందరు కుట్రలు చేస్తూనే ఉన్నారు. నా సినిమాలకు ఏదో ఒక రకంగా ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నారు. మంచి థియేటర్లు, మంచి స్క్రీన్లు కేటాయించకుండా చేస్తున్నారు. అందుకు ఇటీవల విడుదలైన నా ‘ఫ్రై డే' సినిమానే నిదర్శనం. మీడియా కూడా వారికి మద్దతుగా ఉంటోంది. నా సినిమాకు కనీసం మంచి రివ్యూలు కూడా ఇవ్వడం లేదు అన్నారు.

    నా సినిమాపై ఎందుకిలా?

    నా సినిమాపై ఎందుకిలా?

    ఇంతకాలం నేను ఇవన్నీ భరిస్తూ సైలెంటుగా ఉంటూ వచ్చాను. ఇంకా ఎంతకాలం వీటిని భరించాలి. ఇండస్ట్రీలో ఎంతో గౌరవం ఉన్న పహ్లాజ్ నిహలానీ నిర్మించిన చిత్రం, ఆయన ఎంతో మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. మా సినిమా విషయంలో సెన్సార్ బోర్డ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు అని గోవిందా వ్యాఖ్యానించారు.

    కావాలనే చేస్తున్నారు

    కావాలనే చేస్తున్నారు

    నిర్మాత పహ్లాజ్ నిహలానీ మాట్లాడుతూ... సెన్సార్ బోర్డ్ చైర్మన్ ప్రసూజ్ జోషి మీద విమర్శలు గుప్పించారు. కావాలనే తన సినిమాకు ఆయన ఇబ్బంది కలిస్తున్నారని ఆరోపించారు. రూల్ బుక్ తో సంబంధం లేకుండా అనవసర కట్స్ సూచించారు. ఆయన తీరు చూస్తుంటే మాపై కక్షకట్టినట్లు అకర్థమవుతోందన్నారు.

    ఫ్యామిలీ మూవీ

    ఫ్యామిలీ మూవీ

    ఒక సినిమా సెన్సార్‌కు వెళ్లినపుడు కమిటీ నిర్ణయం మేరకు యూ, యూ/ఎ, ఎ సర్టిఫికెట్ జారీ చేస్తారు. కట్స్ ఏమైనా ఉంటే కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. కానీ ప్రసూన్ జోషి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మాది పూర్తిగా ఫ్యామిలీ చిత్రం. అలాంటి చిత్రానికి 20కి పైగా కట్స్ సూచించడం ఏమిటి? అని ప్రశ్నించారు.

    English summary
    Govinda, who has been having struggling to get back in his acting career for the past nine years, feels that a group of people from the film fraternity is conspiring against him. Govinda upcoming film Rangeela Raja produced by Pahlaj Nihalani. The actor is not in a good mood as Central Board of Film Certification (CBFC) has refused to certify the film and ordered 20 cuts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X