Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ ఫుటేజ్ తో పోలీసులు షాకింగ్ విషయాలు
ఇప్పుడు ఇండియా వైడ్ గా సినిమా పరిస్థితులు ఏ రేంజ్ లో మార్పులు చెందాయో అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాలు సక్సెస్ లతో మొత్తం ఇండియన్ సినిమా వైడ్ నటీనటులు, దర్శకులు సహా సంగీత దర్శకులు లాంటి వారు కూడా ఒకో భాషలోకి ఎంటర్ అవుతున్నారు. అలా ఎన్నో ఏళ్ళు నుంచి పలు ఇండస్ట్రీ లలో పాతుకుపోయిన ప్రముఖ స్టార్స్ అంతా సౌత్ సినిమా వైపు వస్తున్నారు.
Recommended Video

మరీ ముఖ్యంగా మన తెలుగు మార్కెట్ లో కూడా అడుగు పెడుతున్నారు. కాగా ఒకప్పుడు నుంచి హీరోయిన్స్ వచ్చారు కానీ ఇపుడు మాత్రం స్టార్ విలన్స్ కూడా హిందీ సినిమా నుంచి తెలుగులో వస్తున్నారు. కాగా ఇలా తెలుగు ఆడియెన్స్ ని రెండు సార్లు పలకరించిన స్టార్ నటుల్లో సైఫ్ అలీఖాన్ కూడా ఒకరు.

మరి సైఫ్ మొదటిగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో చేసిన "ఆదిపురుష్" లో విలన్ గా చేసి తెలుగు ఆడియెన్స్ కి పరిచయం కాగా ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో "దేవర"లో కనిపించి స్ట్రైట్ తెలుగు సినిమా ఎంట్రీ ఇచ్చారు. కాగా ఇలాంటి సైఫ్ పై పలు షాకింగ్ వార్తలు సినీ వర్గాల్లో సంచలంగా మారాయి. ఈ జనవరి 16 తెల్లవారు సమయంలోనే తనపై కత్తితో దాడులు చేయడం తన ఇంట ఎవరో దొంగతనానికి రావడం అనేది షాకింగ్ గా మారింది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 కత్తి పోట్లకి సైఫ్ గురయ్యారు. దీనితో హిందీ సినిమాని షేక్ చేస్తున్న ఈ కేసులో ఇపుడు షాకింగ్ నిజాలు బయటకి వస్తున్నాయి. ఇలా లేటెస్ట్ గా పోలీసులు ఇచ్చిన కొన్ని వివరాలు షాకింగ్ గా ఉన్నాయని తెలుస్తుంది. కాగా ఇది సైఫ్ పై ఎవరో ప్లాన్డ్ గానే చేసినట్టుగా ఉందని ముంబై పోలీసు అంటున్నారు.

తాము సీసీటీవీ ఫుటేజ్ లో చెక్ చేసిన దాని ప్రకారం చాలా సమయం వరకు బయట నుంచి ఎవరూ వచ్చిన దాఖలాలు లేవని తెలిపారు. అంటే ఎవరో చాలా ముందే లోపలకి వచ్చి ముందే సైఫ్ ఇంట్లోకి వెళ్లాలని ప్లాన్ చేసుకొని ఉండొచ్చని అంటున్నారు. దీనితో ఈ ఘటనలో సైఫ్ కి లేదా ఆ పరిసరాల్లో బాగా తెలిసినవారే చేసి ఉండొచ్చనే కొత్త కోణం బయటకి రావడం ఆశ్చర్యంగా మారింది.
దీనితో సైఫ్ కేసులో ఇపుడు మరో మలుపు వచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే సైఫ్ హాస్పిటల్ లోనే చికిత్స తీసుకుంటుండగా కుటుంబీకులు సినీ ప్రముఖులు కూడా దీనిపై స్పందించారు. అలాగే తెలుగు నుంచి దేవర హీరో ఎన్టీఆర్ కూడా స్పందించగా తనతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఉదంతంపై మాట్లాడ్డం జరిగింది. ఇలా ప్రస్తుతానికి అయితే సైఫ్ విషయంలో పరిస్థితులు కొంచెం సీరియస్ గా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications











