చమ్మచక్క ఆటలాడుతున్న ఆయుష్మాన్ ఖురానా... వైరల్ అయిన వీడియో
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఇటీవలే గులాబో సితాబో సినిమాతో ఆకట్టుకున్నాడు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో పోటాపోటీగా నటించేసి వహ్వా అనిపించుకున్నాడు. అయితే తాజాగా మనోడు మరో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. అది రియల్ లైఫ్ లో కావడం మరో విశేషం.
విషయం ఏమిటంటే, ఆయుష్మాన్ లాక్ డౌన్ లో చంఢీఘఢ్ లోని తన స్వగృహంలో సమయం వెళ్లదీస్తున్నాడు. ఇక ఇంటిల్లపాదీనీ చూసేసరి చిన్నతనం గుర్తుకువచ్చిందట అబ్బాయికి. అందుకే తమ్ముడితో కలసి చిన్నప్పటి ఆటలన్నీ ఆడేసుకుంటున్నాడు. దీంతో పాటే, గతంలోకి జారుకుని ఆ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నాడు.

ఆ మిలో అంటూ తమ్ముడితో చమ్మచక్కలాడిన ఆయుష్మాన్, ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడో లేదో, అది వెంటనే వైరల్ అయిపోయింది. ఆయుష్మాన్, ఆపరశక్తి ఇద్దరూ భలే ఉన్నారు అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications











