కుక్కతో సెక్స్ చేస్తావా అని.. చీకటి గదిలో లైంగికంగా హింస.. దర్శకుడిపై ఆరోపణలు

మీటూ ఉద్యమం ఊపందుకోవడంతో సినీ ప్రముఖుల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దర్శకుడు సాజిద్ ఖాన్‌పై లెక్కలేనన్ని ఆరోపణలు వస్తున్నాయి. సలోని చోప్రా బయటపెట్టిన దారుణాలు బయటకు రావడంతో సాజిద్‌ ఖాన్‌పై లైంగిక వేధింపుల అంశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సాజిద్‌పై లిపిస్టిక్ అండర్ మై బుర్ఖా ఫేమ్ అహానా కుమ్రా దారుణమైన ఆరోపణలు చేసింది. తాజాగా జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అహానా సంచలన విషయాలు బయటపెట్టింది. వివరాల్లోకి వెళితే..

చీకటి గదిలో తీసుకెళ్లి

చీకటి గదిలో తీసుకెళ్లి

గతేడాది సాజిద్ ఖాన్‌తో నాకు చేదు అనుభవం ఎదురైంది. అతని చెత్త ప్రవర్తనతో షాక్ తిన్నాను. ఓ రోజు అతడిని కలుసుకోవడానికి వెళ్లాను. అతను నన్ను ఓ చీకటి గదిలోకి తీసుకెళ్లాడు. బయటకు వెళ్దామని చెప్పగా.. మా అమ్మకు డిస్ట్రబ్ అవుతుంది. ఇక్కడే కూర్చొందామని చెప్పడంతో నా మనసు ఏదో కీడు శంకించింది అని అహానా చెప్పింది.

కుక్కతో సెక్స్ చేస్తావా? అని..

కుక్కతో సెక్స్ చేస్తావా? అని..

గదిలో చీకటి ఉండటంతో లైట్లు వేయమని చెప్పాను. నాతో ఎదో ఒకటి మాట్లాడటానికి ప్రయత్నించాడు. దాంతో మా అమ్మ పోలీస్ ఆఫీసర్. మీరు సరిగా ప్రవర్తించమని హెచ్చరించాను. ఆ తర్వాత నాతో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ఒకవేళ కుక్కతో సెక్స్ చేస్తే నీకు రూ.100 కోట్లు ఇస్తాను అని ఓ సాజిద్ ఓ ప్రశ్న అడిగాడు.

సాజిద్ మాటలతో దారుణంగా

సాజిద్ మాటలతో దారుణంగా

సాజిద్ మాటలతో ఒక్కసారిగా సీరియస్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ నిలదీశాను. దాంతో సిల్లీ, సెక్సీ జోకులు వేసి నన్ను నవ్వించేందుకు ప్రయత్నించాడు. నా సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని ఏదో చెప్పి మభ్య పెట్టేందుకు ప్రయత్నించాడు. అలాంటి ప్రవర్తనతో ఓ దశలో విసిగిపోయాను.

హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం కష్టం

హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం కష్టం

నీవు అతిగా ఆలోచిస్తావు. దాన్ని బేస్ చేసుకొని అతిగా మాట్లాడుతావు. అలాగైతే మెయిన్ స్ట్రీమ్ సినిమాలో నీవు హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం కష్టం అని నా భవిష్యత్‌ను తేల్చిపడేశాడు. ఆ రోజంతా సాజిద్ చెత్త ప్రవర్తన నాకు కాళరాత్రిగా మిగిలింది అని అహానా కుమ్రా మీడియాకు తెలిపింది.

 సాజిద్ ప్రవర్తనను తప్పుపట్టి..

సాజిద్ ప్రవర్తనను తప్పుపట్టి..

మీ టూ ఉద్యమం కారణంగా సాజిద్ ఖాన్‌ ప్రవర్తనపై విమర్శల వెల్లువెత్తాయి. చాలా మంది నిర్మాతలు, నటులు సాజిద్ ప్రవర్తనను తప్పుపట్టారు. దాంతో హౌస్‌ఫుల్ 4 చిత్ర దర్శకుడి బాధ్యత నుంచి సాజిద్ తప్పుకోవడం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హౌస్‌ఫుల్ 4 చిత్రానికి ఫర్హాద్ సమ్జి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X