నా కూతురితో నీ మేనేజర్ అసభ్యంగా.. నీవు తండ్రివేనా? నవాజుద్దీన్ సిద్దిఖీపై భార్య తీవ్ర ఆరోపణలు
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆయన భార్య ఆలియా మధ్య వివాదంగా మరింత ముదురుతున్నట్టు కనిపిస్తున్నది. పిల్లల సంరక్షణ విషయంలో గొడవ పడుతున్న ఈ ఇద్దరి వాదనలు మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా భార్య ఆలియా చేసిన వ్యాఖ్యలపై ఇటీవల నవాజుద్దీన్ సిద్దిఖీ సమాధానం ఇచ్చారు. అయితే తన భర్త రాసిన బహిరంగ లేఖపై ఆలియా ఘాటుగా స్పందించి.. ఆన్‌లైన్ మరో లేఖను జవాబుగా రాసింది. ఆలియా రాసిన లేఖ వివరాల్లోకి వెళితే..

నవాజుద్దీన్ సిద్దిఖీ దంపతుల వివాదం
పిల్లల సంరక్షణ విషయంలో నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆలియా మధ్య బాంబే హైకోర్టులో విచారణ జరుగుతున్నది. అయితే పిల్లల పెంపకం గురించి తల్లిదండ్రులు కోర్టు బయట ఓ నిర్ణయానికి రావాలని చెప్పింది. ఆ క్రమంలో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకొంటున్నారు. ఈ క్రమంలో భార్య చేసిన ఆరోపణలకు నవాజుద్దీన్ సిద్దిఖీ జవాబిస్తూ నీపై ఇది చేసే ఆరోపణలు కాదు.. నా భావోద్వేగాలను వెల్లడిస్తున్నాను అంటూ అన్నారు.

మాటల్లో సౌమ్యంగా.. చేతల్లో మాత్రం
అయితే నవాజుద్దీన్ చేసిన బహిరంగ లేఖపై ఆయన భార్య ఆలియా విరుచుకుపడ్డారు. నీవు మాటల్లోనే చాలా మౌనంగా కనిపిస్తావు. చేతల్లో ఆ విషయం కనిపించదు అంటూ ఘాటుగా స్పందించింది. తన లేఖలో ఆయన గురించి వెల్లడిస్తూ.. నీవు బాధ్యతారహితమైన తండ్రివి. నా అనుమతి, నా అంగీకారం లేకుండా మైనర్ బాలికైన నా బిడ్డను నీ మేనేజర్‌కు అప్పగించి మరో దేశానికి పంపించావు అని ఆలియా ఆరోపించింది.

నా కూతురితో నీ మేనేజర్ అసహ్యంగా
నా బిడ్డను నీ మేనేజర్ వెకిలిగా గిలించుకొంటూ..అసభ్యంగా ప్రవర్తించాడు. నా కూతురికి ఇష్టం లేకున్నా నీ మేనేజర్ కౌగిలించుకొనేందుకు ప్రయత్నించాడు. నీ మేనేజర్ చర్యలను నీవు ఖండించలేదు. నీవు గానీ, నేను గానీ లేకుండా నా కూతురిని పరాయి వ్యక్తి ఆధీనంలో ఎలా ఉంచుతావు అని నవాజుద్దీన్ సిద్దిఖీని ఆలియా ప్రశ్నించింది.

నాకు తెలియకుండా నా కూతుర్ని
నా బిడ్డను నాకు అప్పగించకుండా నీ మేనేజర్‌కు అప్పగించి విదేశాలకు పంపించావు. నీ మేనేజర్‌ను గుడ్డిగా నమ్ముతున్నావు. నవమాసాలు మోసిన తల్లికి దూరంగా చేశావు. ఆమె సంరక్షణ విషయంలో నన్ను నమ్మడం లేదు. నా బిడ్డను అప్పగించకుండా నాపై బెదిరింపులకు పాల్పడుతున్నావు అని ఆలియా నిలదీసింది.

నన్ను అరెస్ట్ చేయించడానికి
నా బిడ్డను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే.. అక్రమంగా ఇంట్లోకి చొరబడిందని కేసు పెట్టావు. నన్ను అరెస్ట్ చేయించడానికి నీ పరపతి, నీ పవర్‌ను ఉపయోగించావు. కానీ నా వాదన ముందు నీ నాటకాలు పనిచేయలేదు. నన్ను అరెస్ట్ చేయించడం నీ తరం కాలేదు. నీవు ఒక డేంజరస్ ఫాదర్ అంటూ నవాజుద్దీన్ సిద్దిఖీపై ఆలియా ఆరోపణలు చేసింది.


Click it and Unblock the Notifications











