నాతో పెళ్లి.. ప్రియురాలితో డేటింగ్.. నవాజుద్దీన్ ప్రైవేట్ లైఫ్‌ను బయటపెట్టిన భార్య

ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ‌పై ఆయన భార్య ఆలియా సిద్ధిఖీ నిప్పులు చెరిగింది. కోర్టులో విడాకులు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత నవాజుద్దీన్ సిద్ధిఖీ వ్యక్తిగత వ్యవహారాలపై అపరకాళి లేచింది. తనను మానసిక, శారీరకంగా ఎలా హింసించారనే విషయాలను వెల్లడించిన విషయాలు మీడియాలో సంచలనంగా మారాయి. జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ వీడియో ఇంటర్వ్యూలో ఇద్దరి మధ్య జరిగిన విషయాలను, వైవాహిక జీవితంలో చోటుచేసుకొన్న విషయాలను పూసగుచ్చినట్టు చెబుతూ..

ప్రేమ, సహజీవనం, పెళ్లి

ప్రేమ, సహజీవనం, పెళ్లి

ముంబైలో సినిమా కోసం పనిచేస్తున్న సమయంలో జరిగిన పరిచయంతో మేము దగ్గరయ్యాం. ఆ తర్వాత ప్రేమలో పడి సహజీవనం ప్రారంభించాం. అలాగే ముందడుగు వేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నాం. అయితే పెళ్లికి ముందు నుంచే మా రిలేషన్‌లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత సర్దుకుంటాయని భావించాం. కానీ 15 ఏళ్ల తర్వాత కూడా అవి అలాగే ఉంటూ.. మానసిక క్షోభకు గురిచేశాయి అని ఆలియా చెప్పారు.

మరో మహిళలతో సంబంధం

మరో మహిళలతో సంబంధం

నవాజుద్దీన్ వ్యవహారం ముందు నుంచి చాలా దారుణంగా ఉండేది. మేమిద్దరం డేటింగ్ సమయంలోను, అలాగే పెళ్లి చేసుకోవాలని సిద్ధమైన సమయంలో కూడా నవాజుద్దీన్‌కు మరో మహిళతో సంబంధం ఉండేది. ఆ విషయంపై మా మధ్య పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత చాలాసార్లు గొడవలు జరిగాయి. కానీ ఆమెతో సంబంధాన్ని అలానే కొనసాగించాడు అని ఆలియా బయటపెట్టింది.

ప్రసవం సమయంలో నరకం

ప్రసవం సమయంలో నరకం

నేను గర్బవతిగా ఉన్నప్పుడు నవాజ్ ప్రవర్తనతో నరకం అనుభవించాను. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నాకు సహరించేవాడు కాదు. స్వయంగా నేనే కారును డ్రైవ్ చేసుకొంటూ వైద్య పరీక్షలు చేయించుకొనే దానిని. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే. డెలివరీ కోసం వెళ్లినప్పుడు నేను ఒంటరిగానే వెళ్లి హాస్పిటల్‌లో చేరాను. ఇలా తోడు లేకుండా ప్రసవం కోసం వెళ్లిన మొదటి మహిళను నేనే కావోచ్చు అని ఆలియా అన్నారు.

Recommended Video

Arjun Suravaram Movie Review | Samantha In Family Man Season 2
నవాజ్ బుద్ది తీరు, మారలేదు

నవాజ్ బుద్ది తీరు, మారలేదు


ఇక హాస్పిటల్‌లో నేను పురిటి నొప్పులతో బాధపడుతుంటే నవాజ్ వచ్చాడు. కానీ ఆయన ఆ సమయంలో బయట ఎక్కడో ఉండి తన ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుతుంటూ ఉన్నాడు. ఆయన వ్యవహారం, ప్రవర్తన, నిజస్వరూపం ఫోన్ బిల్లులు చూసిన తర్వాత గానీ అర్ధం కాలేదు. ఇప్పటికీ నవాజ్ బుద్ది, తీరు మారలేదు. ఆయనతో కలిసి బతకడం కంటే విడిపోవడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చాను అని అలియా సిద్ధిఖీ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X