ఎవ్వరితోనూ అలాంటి సంబంధాలు లేవు.. నా ఫోటోలను అలా వాడుతున్నారు.. నవాజుద్దీన్ భార్య ఫైర్
బాలీవుడ్ బ్రేకప్‌లు, లవ్ స్టోరీలు, విడాకుల వ్యవహారం వంటివి ఎన్ని రోజులు చెప్పుకున్నా తరగవు. అవి ఎప్పుడూ ముగిసిపోని అంశాలుగానే ఉంటాయి. ప్రేమలో ఎంతగా త్వరగా పడతారో బ్రేకప్‌లు అంతే త్వరగా చెబుతారు. పెళ్లి, విడాకుల గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ-ఆలియా సిద్దిఖీ విడాకుల వ్యవహారం తెగ వైరల్ అవుతోంది. తాను పదేళ్లుగా నరకం అనుభవిస్తున్నానని, ఈ లాక్ డౌన్ సమయంలో ఎంతో ఆలోచించాని ఏం కోల్పోయానో తెలుసుకున్నానని అందుకే నవాజుద్దీన్‌కు విడాకులు ఇచ్చానని ఆలియా చెప్పుకొచ్చింది.
అయితే ఈ వ్యవహారంలో ఆలియాకు అక్రమ సంబంధాలున్నాయని ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ మేరకు నిజాన్ని బతికించడానికి ట్విట్టర్ ప్రపంచలోకి ఎంట్రీ ఇచ్చినట్టు, తన వాదనను వినిపించుకునే అవకాశం ఇక్కడ ఉంటుందని ఆలియా చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె చెప్పిన విషయాలేంటో ఓ సారి చూద్దాం.

స్పందించని నవాజుద్దీన్..
బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విడాకుల వ్యవహారాం గత కొన్ని రోజులుగా తెగ వైరల్ అవుతోంది. మే 7న నవాజుద్దీన్ భార్య ఆలియా సిద్దిఖీ వాట్సప్ మెయిల్ ద్వారా విడాకుల నోటీస్ పంపింది. అయితే నవాజుద్దీన్ మాత్రం ఇంత వరకు స్పందించలేదని, ఈ వ్యవహారంపై మీడియాతో ఆలియా మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించింది.

పదేళ్ల నుంచీ సమస్యలే..
విడాకుల విషయంపై ఆలియా మాట్లాడుతూ.. అందరి దృష్టికి తీసుకురాలేని ఎన్నో సమస్యలున్నాయని చెప్పకొచ్చింది. కానీ అవన్నీ నేను ఎప్పుడు పబ్లిక్‌గాచెప్పలేదని తెలిపింది. పదేళ్ల క్రితం మేము పెళ్లి చేసుకున్నప్పటి నుంచీ సమస్యలు ఉన్నాయని, ఈ లాక్ డౌన్ సమయం నాకు చాలా ఉపయోగపడిందనీ, ఆత్మవిమర్శన చేసుకునే టైమ్ దొరికిందని పేర్కొంది.

సంబంధాలు అంటగడుతూ..
తనకు వేరే వారితో సంబంధాలు అంటగడుతూ తన ఫోటోలను అభ్యంతరకరంగా వాడుతున్నారని మీడియాపై ఆలియా ఫైర్ అయింది. తన వాదనను వినిపించడానికే ట్విట్టర్‌లోకి వచ్చానని, నిజాన్ని ఎవ్వరూ డబ్బుతో కొనలేరని చెప్పుకొచ్చింది.
Recommended Video

ఎవ్వరితోనూ రిలేషన్‌షిప్ లేదు..
ఏ మనిషితోనూ సంబంధం లేదని, కావాలనే కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు రాస్తున్నాయని చెప్పుకొచ్చింది. ఎవరెంత చేసిన నిజాన్ని మాత్రం దాయలేరని, ఎవ్వరూ కొనలేరని తెలిపింది. తొలి భార్య నుంచి విడాకులు తీసుకున్న సిద్ధిఖీ... 2009లో అలియాను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











