ఆమె అలా ఎలా నడుము తిప్పుతుంది.. 10 ఏళ్ళు అయినా నా వల్ల కాదు!

హీరోలు వెండి తెరపై వేసే స్టెప్పులతో అభిమానులు కేరింతలు కొడుతుంటారు. తమ అభిమాన హీరో డాన్స్ వేస్తుంటే ఫాన్స్ అదొక సంతోషం. సినిమా వినోదంలో డాన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. హీరోలలో చాలా మంది అద్భుతంగ డాన్స్ చేసేవాళ్ళు ఉన్నాయి. హీరోయిన్లు కూడా ఉన్నారు. కానీ తమ డాన్సింగ్ స్కిల్స్ ని బయటపెట్టే అవకాశం సినిమాల్లో హీరోయికి దక్కినంతగా హీరోయిన్లకు దక్కదు. బాలీవుడ్ స్టార్ హీరోలకు ధీటుగా తాము అద్భుత డాన్సర్స్ అని ఐశ్వర్యారాయ్, కత్రినాకైఫ్, ప్రియాంక చోప్రా పలు చిత్రాల్లో నిరూపించుకున్నారు. తాజాగా కత్రినా కైఫ్ డాన్స్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

మతిపోగోట్టిన ఐశ్వర్యారాయ్

మతిపోగోట్టిన ఐశ్వర్యారాయ్

ధూమ్ 2 చిత్రంలో ఐశ్వర్యారాయ్ డాన్స్ గురించి చాలా కాలం మాట్లాడుకున్నారు. అందాలతోనే కాదు మతి పోగొట్టే స్టెప్పులతో సైతం ఐశ్వర్యారాయ్ కుర్రకారుని ఫిదా చేసింది. ధూమ్ 3 చిత్రంలో దాదాపుగా కత్రినా కైఫ్ అలాంటి అలజడిని సృష్టించింది.

డాన్సులకు పెట్టింది పేరు

డాన్సులకు పెట్టింది పేరు

ఇప్పటి బాలీవుడ్ హీరోయిన్ల డాన్స్ గురించి మాట్లాడుకోవాంటే ముందుగా కత్రినా కైఫ్ గురించే మాట్లాడుకోవాలి. అగ్నిపత్ చిత్రంలో చికిని చమేలీ సాంగ్ కు కత్రినా డాన్స్ గురించి ఇప్పటికి మాట్లాడుకుంటుంటారు. ఎంతటి కష్టసాధ్యమైన స్టెప్పులనైనా కత్రినా అవలోకగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఇటీవల పలు చిత్రాలలో తన డాన్స్ మూమెంట్స్ తో కత్రినా సినిమాలకు హైప్ తీసుకుని వచ్చింది.

అందాల సురయ్యా

ప్రస్తుతం కత్రినా కైఫ్ అమిర్ ఖాన్ సరసన ప్రతిష్టాత్మక చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కత్రినా పాత్ర పేరు సురయ్యా. ఫస్ట్ లుక్ లో కత్రినా గ్లామర్ తో అబ్బురపరిచింది. తాజగా ఈ చిత్రంలో సూరయ్య అనే వీడియో సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

అలా ఎలా సాధ్యం

అలా ఎలా సాధ్యం

ఈ వీడియో సాంగ్ లో తన డాన్స్ తో కత్రినా మరో మారు ఆశ్చర్యపరిచింది. తనకు మాత్రమే సాధ్యమైన విధంగా హిప్ మూమెంట్ తో చెలరేగిపోయింది. కత్రినా అలా ఎలా నడుము తిప్పగలుగుతోందని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి కత్రినా డాన్స్ కు అమిర్ ఖాన్ కూడా ఫిదా అయిపోయాడు.

10 ఏళ్ళు అయినా నా వల్ల కాదు

10 ఏళ్ళు అయినా నా వల్ల కాదు

పదేళ్లు ప్రాక్టీస్ చేసినా కత్రినా కైఫ్ లాగా తాను డాన్స్ చేయలేనని అమిర్ ఖాన్ వ్యాఖ్యానించాడు. కత్రినా డాన్సింగ్ స్కిల్స్ కు ఇది అతిపెద్ద ప్రశంస అని చెప్పొచ్చు. భారీ అంచనాలతో ఈ దీపావళికి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X