అమీర్ దెబ్బకు డైరెక్టర్ అవుట్.. వాటిని సహించను.. అద్భుత రోల్‌లో మిస్టర్ ఫర్‌ఫెక్ట్

బాలీవుడ్ మ్యూజిక్ దిగ్గజం, టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించేందుకు మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్, ఆయన భార్య కిరణ్ రావు ముందుకు వచ్చారు. గతంలో ఈ చిత్ర దర్శకుడు సుభాష్ కపూర్‌పై నటి గీతికా త్యాగి లైంగిక ఆరోపణలు చేయడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి అమీర్ దంపతులు తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఆరోపణల నేపథ్యంలో సుభాష్ కపూర్ ఈ సినిమా నుంచి వైదొలగడంతో అమీర్ దంపతులు మళ్లీ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే..

మొఘల్ చిత్రం నుంచి

మొఘల్ చిత్రం నుంచి

దర్శకుడు సుభాష్ కపూర్ అత్యాచార ఆరోపణల్లో కూరుకుపోయిన నేపథ్యంలో అమీర్ దంపతులతో గుల్షన్ కుమార్ కుమారుడు, టీ సిరీస్ చైర్మన్ భూషణ్ కుమార్ చర్చలు జరిపారు. ఆ తర్వాత మొఘల్ సినిమా నుంచి సుభాష్ కపూర్ వైదొలగడంతో ప్రాజెక్ట్‌కు మార్గం సుగమైంది.

టైటిల్ రోల్‌లో అమీర్

టైటిల్ రోల్‌లో అమీర్

ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్న మొఘల్ చిత్రాన్ని అమీర్ ఖాన్ నిర్మించడమే కాకుండా టైటిల్ రోల్ కూడా పోషిస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. మొఘల్ సినిమా కథ అమీర్‌ హృదయానికి దగ్గరగా ఉండటంతో ఎలాగైనా ఈ సినిమాను తన చేతుల మీదుగా నిర్మించాలని నిర్ణయం తీసుకొన్నాడు. పలుమార్లు భూషణ్, అమీర్ ఖాన్ చర్చలు జరిపారు.

దర్శకుడి కోసం వేట మొదలు

దర్శకుడి కోసం వేట మొదలు

సుభాష్ కపూర్ వైదొలగడంతో దర్శకుడి వేట మొదలైంది. పలువురి పేర్లు అమీర్, భూషణ్ దృష్టికి వచ్చినట్టు సమాచారం. దర్శకుడి ఎంపికను పూర్తి చేసి త్వరలోనే నటీనటులు వివరాలను అధికారికంగా వెల్లడించనున్నట్టు తెలిసింది.

సుభాష్ కపూర్ వ్యవహారంపై

సుభాష్ కపూర్ వ్యవహారంపై

దర్శకుడు సుభాష్ కపూర్‌ను బయటకు పంపించడం వెనుక అమీర్ దంపతులు తీవ్రంగా స్పందించినట్టు అర్ధమవుతున్నది. అమీర్, కిరణ్ రావు సంయుక్తంగా ఓ ప్రకటనను జారీ చేశారు. లైంగిక దాడులు, తోటి నటీనటులతో అసభ్యంగా వ్యవహరించడం సహించలేమని వారు పేర్కొన్నారు.

లైంగిక వేధింపులతో

లైంగిక వేధింపులతో

అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లైంగిక వేధింపుల విషయంలో చాలా సీరియస్‌గా ఉంటుంది. మేము సామాజిక అంశాలపై పోరాటం చేస్తున్న సమయంలో ఇలాంటి వాటిని మేము సహించం. ఇలాంటి వ్యవహారాల్లో ఎవరు ఉన్నా తాము కఠిన నిర్ణయం తీసుకొంటామని అమీర్ స్పష్టం చేశారు. అమీర్ ప్రకటనను స్వాగతిస్తూ గీతికా త్యాగి ట్వీట్ చేసింది.

నవంబర్ 8న థగ్స్ ఆఫ్ హిందూస్థాన్

నవంబర్ 8న థగ్స్ ఆఫ్ హిందూస్థాన్

ప్రస్తుతం అమీర్ ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషించారు. కత్రినా కైఫ్ అమీర్ సరసన నటిస్తున్నది. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం భారీ అంచనాలను పెంచుకొన్నది. దీపావళి పండుగను పురస్కరించుకొని థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ నవంబర్ 8న రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X