twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తీవ్ర విషాదంలో అమీర్ ఖాన్.. ఆప్తుడి మరణంతో భోరున విలపించిన మిస్టర్ ఫర్‌ఫెక్ట్

    |

    బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ దంపతులు విషాదంలో మునిగిపోయారు. సుదీర్ఘకాలంగా తమ వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్ అమోల్ కన్నుమూయడంతో అమీర్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. తనకు ఇష్టమైన అమోల్ ఇక లేరనే విషయాన్ని అమీర్ జీర్ణించుకోలేకపోతున్నారు. మంగళవారం గుండెపోటుతో మరణించిన అమోల్ అంత్యక్రియలకు భార్యతో కలిసి హాజరయ్యారు. అమోల్‌కు బరువెక్కిన గుండెతో కన్నీటి వీడ్కోలు పలికారు. అమోల్ మరణం గురించి..

    అమోల్‌కు గుండెపోటు రావడంతో

    అమోల్‌కు గుండెపోటు రావడంతో

    అమీర్ ఖాన్ వద్ద అమోల్ గత 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో కూడా అమీర్ వెంటనే ఉన్నారు. మంగళవారం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయనను అమీర్ ఖాన్ స్వయంగా ముంబైలోని హోలీ ఫ్యామిలీ హస్పిటల్‌కు తరలించారు. కానీ హాస్పిటల్ తరలించే లోపే అమోల్ కన్నుమూయడంతో అమీర్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఓ దశలో తట్టుకోలేక భోరున విలపించారు అని సన్నిహితులు చెప్పారు.

    షాక్‌లో కిరణ్ రావు, ఇతర కుటుంబ సభ్యులు

    షాక్‌లో కిరణ్ రావు, ఇతర కుటుంబ సభ్యులు

    అమోల్ మరణం గురించి అమీర్ ఖాన్ స్నేహితుడు కరీం హాజీ మీడియాతో మాట్లాడుతూ.. అమీర్ ఖాన్, కిరణ్ రావు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. అయితే అమోల్ ఆరోగ్యం కూడా బాగానే ఉంది. కానీ ఒక్కసారిగా గుండెపోటు రావడంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కానీ తన అత్యంత సన్నిహితంగా ఉండే ఆయనను మాత్రం కాపాడుకోలేదనే బాధ అమీర్ వెంటాడుతున్నది అని తెలిపారు.

    అమోల్ మరణించారంటే.

    అమోల్ మరణించారంటే.

    అమీర్ ఖాన్, కిరణ్ రావు తన మిత్రులతో మాట్లాడుతూ తీవ్ర విచారం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అమోల్ మరణం మాకు తీరని లోటు. ఆయన లేని మా జీవితం ఊహించుకోలేం. మా ఇంటిలో ఓ సభ్యుడిగా ఉన్నారు. ఇక నుంచి మాతో అమోల్ లేరని నమ్మలేకపోతున్నాం. ఈ సమయంలో ఏం చేయాలో తెలియడం లేదు. మా జీవితం నుంచి అమోల్‌ను కోల్పోయాం అని అమీర్ స్నేహితుడు కరీమ్ హాజీ అన్నారు.

     అంత్యక్రియలకు హాజరైన అమీర్ ఖాన్

    అంత్యక్రియలకు హాజరైన అమీర్ ఖాన్

    అమోల్ అంత్యక్రియలకు అమీర్ ఖాన్, కిరణ్ రావు సవ్యంగా హాజరయ్యారు. ఎన్నో ఏళ్లుగా తనతో ప్రయాణించిన వ్యక్తి అంతిమ యాత్రలో పాల్గొని భావోద్వేగానికి గురయ్యారు. అమోల్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అమోల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిని స్వయంగా కలిసి మనోధైర్యాన్ని కల్పించడమే కాకుండా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చినట్టు సన్నిహితులు తెలిపారు.

    అమోల్ గొప్ప గుణం కల వ్యక్తి

    అమోల్ గొప్ప గుణం కల వ్యక్తి

    అమీర్ ఖాన్ లాంటి సూపర్‌స్టార్‌తో పనిచేసినా సింపుల్‌గా ఉండేవారు. కేవలం అమీర్‌తోనే కాకుండా ఆయనను కలిసే వారితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అద్భుతమైన మనసున్న వ్యక్తి. ఎదుటి వారికి ఏదైనా అయితే తట్టుకొలేని గొప్ప గుణం ఉంది. అంతేకాకుండా ఎప్పుడు నవ్వుతూ, చురుకుగా కనిపించేవారు. చాలా కష్టపడి పనిచేసే తత్వం ఆయనది అని అమీర్ ఖాన్ సన్నిహితులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అమీర్‌తో కలిసి పనిచేయడానికి ముందు రాణి ముఖర్జితో కూడా కలిసి పనిచేశారు.

    Recommended Video

    శ్రీదేవీ జీవితంలో కీలకఘట్టాలు...!
    లాల్ సింగ్ చద్దాగా అమీర్ ఖాన్

    లాల్ సింగ్ చద్దాగా అమీర్ ఖాన్

    అమీర్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఫారెస్ట్ గంప్ అనే చిత్రాన్ని రీమేక్‌గా లాల్ సింగ్ చద్దా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రంలో టామ్ హాంక్స్ పోషించిన పాత్రను మిస్టర్ ఫర్‌ఫెక్ట్ పోషిస్తున్నాడు. అద్వైత్ చందన్ దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కరీనా కపూర్, మోనా సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా అమీర్ ఖాన్ సొంత బ్యానర్‌పై రూపొందుతున్నది. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు.

    English summary
    Aamir Khan' assistant Amol died with Heart Attack. With this shocking incident, Aamir entire family goes into shock. Amol was working with Aamir Khan since 25 years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X