అమీర్ ఖాన్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు... సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి సౌత్ మూవీ రీమేక్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' భారీ ప్లాప్ తర్వాత ఆచితూచి ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన 'లాల్ సింగ్ చద్దా' బయోపిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కరీనా కపూర్ హీరోయిన్. ఈ సినిమాతో పాటు అమీర్ ఖాన్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు సమాచారం.
తమిళ హిట్ మూవీ 'విక్రమ్ వేద' హిందీలో రీమేక్ ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో నటించడానికి అమీర్ ఖాన్ అంగీకారం తెలిపారని, అక్కడ కూడా ఇదే పేరుతో దీన్ని రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అమీర్ ఖాన్ నెగెటివ్ రోల్ చేయబోతున్నట్లు టాక్.

ఇందులో అమీర్ ఖాన్‌తో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా లీడ్ రోల్ చేయబోతున్నారు. సైఫ్ ఇందులో మంచి పోలీస్‌గా కనిపిస్తారట. తమిళంలో దర్శకత్వంలో వహించిన గాయిత్రి పెష్కర్ హిందీలోనూ ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయబోతున్నట్లు సమాచారం. 2020 మార్చిలో దీన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట.
తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో 'విక్రమ్ వేద' తెరకెక్కింది. హిందీలో విజయ్ సేతుపతి పాత్రలో అమీర్ ఖాన్, మాధవన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారు. ఈ చిత్రాన్ని నీరజ్ పాండే నిర్మిచబోతున్నారు.


Click it and Unblock the Notifications











