twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ ఫెయిల్యూర్... ప్రేక్షకులకు అమీర్ ఖాన్ క్షమాపణలు!

    |

    Recommended Video

    Aamir Khan Apologises For Thugs Of Hindostan Failure | Filmibeat Telugu

    అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీ బాక్సాఫీసు వద్ద అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచిపోయింది.

    2018లో బిగ్గెస్ట్ బాలీవుడ్ మూవీగా విడుదలైన ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగులో 7000 స్క్రీన్లలో విడుదలైనప్పటికీ కనీసం రూ. 150 కోట్లు వసూలు చేయడం కూడా చాలా కష్టం అయిపోయింది. సినిమా ఫెయిల్యూర్ నేపథ్యంలో అమీర్ ఖాన్ రియాక్ట్ అయ్యారు.

    ఈ పరాజయానికి పూర్తి బాధ్యత నాదే: అమీర్ ఖాన్

    ఈ పరాజయానికి పూర్తి బాధ్యత నాదే: అమీర్ ఖాన్

    ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' ఫెయిల్యూర్ రెస్పాన్సిబిలిటీ తానే తీసుకుంటున్నట్లు అమీర్ ఖాన్ ప్రకటించారు. మేము ఈ సినిమా కోసం శక్తి మేర కష్టపడ్డాం. కానీ ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు.

    మిమ్మల్ని మెప్పించలేదు, క్షమించండి

    మిమ్మల్ని మెప్పించలేదు, క్షమించండి

    ఈ సినిమా కొంత మందికి మాత్రమే నచ్చింది. వారికి నా ధన్యవాదాలు తెలిజేస్తున్నా. అయితే చాలా మంది ప్రేక్షకులను మా చిత్రం నిరాశ పరిచినందుకు చాలా బాధగా ఉంది. మేమ మా శక్తిమేర కష్టపడ్డప్పటికీ మీరు కోరుకున్న విధంగా వినోదం అందించలేక పోయినందుకు మీ నుంచి క్షమాపణలు కోరుతున్నాను అని అమీర్ వ్యాఖ్యానించారు.

     షారుక్ ఖాన్ మద్దతు

    షారుక్ ఖాన్ మద్దతు

    ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' ఫెయిల్యూర్ టాక్ వచ్చిన వెంటనే.... అమీర్ ఖాన్‌కు మరో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ నుంచి సపోర్ట్ లభించింది. తన స్నేహితుడి సినిమా విషయంలో ఇలా జరిగినందుకు భాధను వ్యక్తం చేస్తూ షారుక్ తన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

    ఇద్దరు గొప్ప స్టార్స్ కలయిక ఇంత దారుణంగా

    ఇద్దరు గొప్ప స్టార్స్ కలయిక ఇంత దారుణంగా

    అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్.... సినిమాల కోసం ఎంత కష్టపడతారో, తమ పాత్రల పెర్ఫెక్షన్ కోసం ఎంత ఎఫర్ట్ పెడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఇద్దరు గొప్ప నటులు కలిసి చేసిన సినిమాకు ఇలాంటి దారుణ పరాభవం ఎదురుకావడం అభిమానులను సైతం నిరాశ పరిచింది.

    థగ్స్ ఆఫ్ హిందూస్తాన్

    థగ్స్ ఆఫ్ హిందూస్తాన్

    ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ సంస్థ రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 150 కోట్లకు మించి గ్రాస్ రాబట్టలేదు. సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారు.

    English summary
    "I take the full responsibility of Thugs of Hindostan not working with the audience. You can be sure that we tried our level best but somewhere we went wrong. There are a few people who liked the film. I would like to thank them. We realise that most of the people did not like the film. I want to apologise to fans that I couldn't entertain them the way they wanted, though we did try our best." Aamir Khan said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X