మీరు మాకెన్నో నేర్పించారు.. ఉపాధ్యాయుడి మృతిపై ఆమిర్ భావోద్వేగం

మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నేడు ఎమోషనల్ అయ్యాడు. తన ఉపాధ్యాయుడి మరణ వార్తను తెలుసుకున్న ఆమీర్ సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆయనతో ఉన్న అనుభవాలను, అనుభూతులను పంచుకున్నాడు. నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ గురువుకు అంతిమ వీడ్కోలు పలికాడు.

నా మరాఠీ సార్ సుహాస్ లిమాయే నిన్న చనిపోయారనే వార్త నన్ను ఎంతగానో కలిచి వేసింది. సర్.. నాకు ఇష్టమైన టీచర్స్‌లో మీరు ఒకరు.. మీతో కలిసి ఉన్న ప్రతీ క్షణాన్ని నేను ఎంజాయ్ చేశాను.. నేర్చుకోవడం పట్ల మీకు గల ఆసక్తి, కోరికలే మా అందరిలో మీరు నిలిచిపోయేలా చేశాయ్.

 Aamir Khan Condolences To Marathi Teacher

మనం కలిసి ఉన్న ఆ నాలుగేళ్లు నాకు అద్భుతమైన జ్ఞాపకాలు. మనం కలిసి ఉన్న ప్రతీ క్షణం ఇంకా నా మదిలో మెదులుతూనే ఉంది. మీరు నాకు కేవలం మరాఠీనే కాదు.. ఎన్నో విషయాలను నేర్పించారు. థ్యాంక్యూ సర్.. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాను.. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అంటూ ఆమీర్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆమీర్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మేరకు ఆ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్, లుక్ తెగ వైరల్ అయ్యాయి.

 Aamir Khan Condolences To Marathi Teacher

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X